Movie News

దిల్ రాజు ఇప్పుడైనా హిట్ కొడ‌తాడా?

దిల్ రాజు ఇప్పుడైనా హిట్ కొట్ట‌డం ఏంటి.. ఆయ‌న చూడ‌ని స‌క్సెస్‌లా అనిపిస్తోందా? టాలీవుడ్లో ఆయ‌న స‌క్సెస్ రేట్ ఇప్పుడు కొత్త‌గా మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదులెండి. ఇక్క‌డ టాపిక్ దిల్ రాజు బాలీవుడ్ ప్ర‌స్థానం గురించి. గ‌తంలో తెలుగులో టాప్ ప్రొడ్యూస‌ర్లు చాలామంది హిందీలోకి అడుగు పెట్టిన వాళ్లే. ఆ త‌ర్వాత ఆ ఒర‌వ‌డికి బ్రేక్ ప‌డింది.

టాలీవుడ్లో తిరుగులేని ఆధిప‌త్యం చ‌లాయించినప్ప‌టికీ దిల్ రాజుకు పాన్ ఇండియా స్థాయిలో త‌న పేరు మార్మోగేలా చేయాల‌ని ఆశ ఉంది. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్, పుష్ప త‌ర‌హాలో ఓ భారీ చిత్రంతో దేశ‌వ్యాప్తంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌కు హైప్ తీసుకురావాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు. ఐతే ఆ స్థాయి భారీ చిత్రం చేయ‌డానికంటే ముందే ఆయ‌న బాలీవుడ్లోకి అడుగు పెట్టాల‌ని చూశారు.

ముందుగా జెర్సీ సినిమా రీమేక్‌తో అక్క‌డ ఎంట్రీ ఇచ్చారు. కానీ స్యూర్ షాట్ హిట్ అన్న న‌మ్మ‌కం క‌లిగించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. దిల్ రాజుకు అరంగేట్రంలో చేదు అనుభ‌వం మిగిలింది. ఇప్పుడు ఆయ‌న హిట్ రీమేక్‌తో బాలీవుడ్లో మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ఆయ‌న‌తో క‌లిసి భూష‌ణ్ కుమార్ ఇంకో ఇద్ద‌రు నిర్మాత‌లు ఈ చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి జెర్సీకి పోలిక‌లు క‌నిపిస్తున్నాయి.

ఇది కూడా తెలుగు నుంచి రీమేక్ అవుతున్న సినిమా. అలాగే ఒరిజిన‌ల్ తీసిన డైరెక్ట‌రే దీన్ని కూడా రూపొందిస్తున్నాడు. మ‌రి ఫ‌లితం కూడా జెర్సీని పోలి ఉంటుందా.. లేక దిల్ రాజుకు బాలీవుడ్లో తొలి విజ‌యాన్ని రుచి చూపిస్తుందా అన్న‌ది చూడాలి. దీంతో పాటు ఎఫ్‌-2ను కూడా హిందీలో రీమేక్ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు దిల్ రాజు. రాజ్ కుమార్ రావు, సాన్యా మ‌ల్హోత్రా జంట‌గా న‌టించిన హిట్ హిందీ రీమేక్‌కు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జులై 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

This post was last modified on June 17, 2022 9:09 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

40 minutes ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

50 minutes ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

1 hour ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

4 hours ago