Movie News

సాయి ప‌ల్ల‌వి పై కేసు.. రంగంలోకి భ‌జ‌రంగ్ ద‌ళ్ !

విరాట ప‌ర్వం మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా సాయి ప‌ల్ల‌వి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ భ‌జ‌రంగ్ ద‌ళ్ రంగంలో దిగింది. హైద్రాబాద్, సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదు చేసింది. అదేవిధంగా ఈ సినిమా ద‌ర్శ‌కులు వేణు ఊడుగుల పై కూడా కేసు న‌మోదు చేయాల‌ని భావిస్తోంది. విరాట ప‌ర్వం టైటిల్ కూడా అభ్యంత‌రంగానే ఉంద‌ని, మ‌హాభారతంలో ఓ కీల‌క ఘ‌ట్టానికి సంబంధించిన పేరును, న‌క్స‌ల్బ‌రీ మూమెంట్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాకు ఎలా పెడ‌తార‌ని ప్ర‌శ్నిస్తూ  పోలీసుల‌ను ఆశ్ర‌యించేందుకు యోచిస్తోంది.

ఇప్పుడు ఈ రెండు వివాదాలూ సినిమా విడుద‌ల ముందు తీవ్ర సంచ‌ల‌నం అవుతున్నాయి. వీటిపై మూవీ టీం ఇంత‌ర‌కూ స్పందించ‌లేదు. మ‌రోవైపు సాయి ప‌ల్ల‌వికి సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఆమె వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఏమీ లేవ‌ని అంటోంది. అస‌లు సోష‌ల్ కాజ్ తో మాట్లాడే న‌టీన‌టులు చాలా త‌క్కువ‌గా ఉంటున్నార‌ని, ఈ విష‌యంలో సాయి ప‌ల్ల‌వి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేన‌న్న వాద‌న ఒక‌టి విపరీతంగా వైరల్ అవుతోంది.

దీంతో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ గా విడిపోయి ఎప్ప‌టిలానే వాదోప‌వాదాలు వినిపిస్తున్నారు. ఇక సినిమా (జూన్ 17, 2022 ) విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో ఇలాంటి వివాదాలు ఏ విధంగా చిత్రాన్ని ప్ర‌భావితం చేస్తాయో అన్న ఆస‌క్తి కూడా ఉంది. ఎందుకంటే ఇదొక న‌క్స‌ల్బ‌రీ నేప‌థ్యంలో యుద్ధ నేప‌థ్యంలో రాసుకున్న క‌థ. ఇందులో ప్రేమ ఉంది. విప్ల‌వం ఉంది. పోరాట సంబంధ ప్రేమ క‌థ ఒక‌టి ఉంది.

ఈ క‌థ 1990లో పుట్టింది. ఈ క‌థ వ‌రంగ‌ల్ నేప‌థ్యంలో తుపాకీ చ‌ప్పుళ్ల న‌డుమ న‌డుస్తోంది. యుద్ధం ఓ ప్రేమ కథ‌కు ప్రాణం పోసింది అని చెప్ప‌డ‌మే ఈ క‌థ‌కు ఉన్న ప్ర‌ధానోద్దేశం అని డైరెక్ట‌ర్ కమ్ రైట‌ర్ వేణు ఊడుగుల అంటున్నారు. మార్క్సిజంను ప్ర‌మోట్ చేసే చిత్రం ఇది కానేకాద‌ని స్ప‌ష్టం చేస్తూ మూవీ ప్ర‌మోష‌న్లలో ఆయ‌న పూర్తి క‌వితాత్మ‌క ధోర‌ణిలో మాట్లాడుతూ, క‌థాంశ నేప‌థ్యాన్ని అతి స‌ర‌ళంగా వివ‌రించే ప్ర‌య‌త్నం ఒక‌టి చేశారు. ఎన్నో ఒడిదొడుకులు దాటుకుని వ‌స్తున్న ఈ సినిమా కు సంబంధించి వెలువ‌డే సానుకూల ఫ‌లితం పై అటు ద‌గ్గుబాటి రానాతో పాటు సాయి ప‌ల్ల‌వితో పాటు ఇంకా ఎంద‌రో ఔత్సాహిక చిత్ర రూప‌క‌ర్త‌లు కోటి ఆశ‌ల‌తో ఉన్నారు. 

This post was last modified on June 16, 2022 10:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago