సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ వచ్చే ఏడాదే పట్టాలెక్కబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో ఎట్టకేలకు మహేష్ జట్టు కట్టబోతున్నాడు. వీరి కలయికలో సినిమాను చాన్నాళ్ల ముందే ప్రకటించారు కానీ.. సినిమా వచ్చే ఏడాదే మొదలు కానుంది. జక్కన్నతో సినిమా ఆలస్యం అయితే అయింది కానీ.. అది మహేష్ మంచికే అని చెప్పాలి.
మొదట్లో వీరి మధ్య చర్చ జరిగినప్పుడే అయితే రాజమౌళి మామూలు సినిమానే తీసేవాడేమో. కానీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసి ప్రపంచ స్థాయిలో తన పేరు మార్మోగేలా చేసుకున్నాక జక్కన్న మహేష్‌తో సినిమా చేయబోతున్నాడు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పేరు ప్రఖ్యాతులు సాధారణమైనవి కావు.
మన ప్రేక్షకులకు ‘బాహుబలి’తో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ తక్కువగా అనిపించింది కానీ.. అంతర్జాతీయ ఆడియన్స్ స్పందన దీనికి భిన్నంగా ఉంది. హాలీవుడ్లో పేరున్న ఆర్టిస్టులు, ఫిలిం మేకర్లు, టెక్నీషియన్లు, వేరే రంగాలకు చెందిన సెలబ్రెటీలు ‘ఆర్ఆర్ఆర్’ చూసి మెస్మరైజ్ అయిపోయారు. కొన్ని వారాలుగా ఆ సినిమాను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు. తమ జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదని కొందరంటే.. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ కట్టబెట్టాలనేవాళ్లు ఇంకొందరు. కొత్తగా ఇప్పుడు రాజమౌళి తీసిన వేరే సినిమాలను చూడడం మొదలుపెడుతున్నారు హాలీవుడ్ ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో జక్కన్న కొత్త సినిమాలపై వారికి ప్రత్యేక ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇండియాలో ఆల్రెడీ స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ ఉన్న జక్కన్న.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇలాంటి టైంలో మహేష్ ఆయనతో జట్టు కడుతుండటంతో తన సినిమాకు వచ్చే అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. వీరి కలయికలో అంచనాలకు తగ్గ సినిమా వస్తే.. మహేష్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తే తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 15, 2022 5:27 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…