విడుదలకు ముందు విక్రమ్ హిట్ లిస్ట్ తెలుగు డబ్బింగ్ హక్కులను నితిన్ తండ్రి సుమారు ఏడు కోట్లకు కొన్నప్పుడు ఇండస్ట్రీలో ఒకటే గుసగుసలు. ఎప్పుడో తగ్గిపోయిన కమల్ మార్కెట్ కి ఇది చాలా ఎక్కువని కామెంట్ చేశారు. అందులోనూ మహేష్ బాబు సపోర్ట్ తో పాటు రియల్ హీరో బయోపిక్ గా బోలెడంత పాజిటివ్ బజ్ ఉన్న మేజర్ వల్ల ఎఫెక్ట్ అవుతుందనుకున్న వాళ్ళు లేకపోలేదు.చాలా రిస్క్ చేసి విక్రమ్ కొన్నారని మొహం మీద చెప్పినవాళ్ళున్నారు. కట్ చేస్తే రెండు వారాలు దాటకుండానే సీన్ మొత్తం మారిపోయింది.
కేవలం పన్నెండు రోజులకే ఏపి తెలంగాణ నుంచే విక్రమ్ 14 కోట్ల షేర్ ని దాటేసింది. అంటే బ్రేక్ ఈవెన్ లెక్కలో చూసుకుంటే డబుల్ ప్రాఫిట్ అన్నమాట. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు. ఇంకో రెండు వారాలు ఈజీగా ఆడుతుంది. దీనికి పోటీనిచ్చే మాస్ ఎంటర్ టైనర్ దగ్గరలో లేదు. విరాటపర్వం, గాడ్సే, సమ్మతేమే, చోర్ బజార్ ఇవన్నీ డిఫరెంట్ జానర్లు. స్టార్ పవర్ కొన్నిటికే ఉంది. సో మాస్ కి బెస్ట్ ఛాయస్ గా విక్రమ్ తప్ప మరొకటి లేదు. గత వారం వచ్చిన అంటే సుందరానికి ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద తడబడుతున్నాడు.
రిస్క్ ఎక్కువగా ఉండే సినిమా బిజినెస్ లో ఒక్కోసారి సాహసమనిపించే నిర్ణయాలు అద్భుత ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు నితిన్ ఫ్యామిలీ విక్రమ్ విషయంలో తీసుకున్న రిస్క్ రెట్టింపు లాభాలు తెచ్చింది. ఇక్కడే ఇలా ఉంటే తమిళనాడులో పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ 300 కోట్ల గ్రాస్ ని టచ్ చేసేసింది. ఇంకో నెల రోజులు స్ట్రాంగ్ గా ఉండటం ఖాయం. ఈజీగా నాలుగు వందలు దాటడం లాంఛనమే. ఇదంతా చూస్తూ కమల్ ఆనందం మాములుగా లేదు. రెట్టింపు ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులకు రెడీ అవుతున్నాడు.
This post was last modified on June 15, 2022 12:28 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…