మంచు ఫ్యామిలీకి కాకతాళీయంగా అలా వివాదాలు వస్తాయో లేక ముందే ఊహించి బజ్ వచ్చేలా ఇలా ప్లాన్ చేసుకుంటారో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ సినిమాల తాలూకు కాంట్రవర్సీలు ఇటు న్యూస్ ఛానల్స్ కు అటు సోషల్ మీడియాకు మంచి స్టఫ్ గా మారుతున్నాయి. రెండు రోజుల క్రితం మంచు విష్ణు కొత్త సినిమా జిన్నా టైటిల్ అనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణలను తీసుకొచ్చి వాళ్ళను పరిచయడం చేయడం ద్వారా దీని గురించి ప్రమోట్ చేయడం బాగుంది.
కానీ జిన్నా టైటిల్ లోగోని ఏకంగా ఏడుకొండల పైన పెట్టేసి చూపించడం పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రచయిత కోన వెంకట్ దీనికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు. హీరో పేరు గాలి నాగేశ్వరరావు కాబట్టి అది ఇష్టం లేక షార్ట్ కట్ లో జిన్నాగా పిలిపించుకుంటాడని, అందులోనూ తిరుపతిలో జరిగే కథ కాబట్టి అలా సెట్ చేశామని వివరణ ఇచ్చారు. అయితే ఈ సమాధానం ఎవరికీ సంతృప్తినివ్వలేదు. ముఖ్యంగా బిజెపి నాయకులు బాగా పర్సనల్ గా తీసుకుని టీవీ డిబేట్లలో ఏకంగా వార్నింగులు ఇచ్చేశారు.
ఇదంతా ఎంచుకొచ్చిందంటే దేశవిభజన సమయంలో ఎందరో ప్రాణాలు కోల్పోవడానికి ప్రత్యక్ష కారణమైన నేతగా జిన్నాకున్న చెడ్డపేరే. ముఖ్యంగా హిందూవాదుల్లో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. గుంటూరు జిన్నా సెంటర్ విషయంలో ఆ మధ్య జరిగిన రగడ గుర్తుందిగా. మొత్తానికి ఈ వ్యవహారం ఎక్కడ తేలుతుందో కానీ ఫైనల్ గా జిన్నాకు ఫ్రీ పబ్లిసిటీ తీసుకొస్తోంది. ఇప్పటిదాకైతే మంచు విష్ణు వివాదం గురించి స్పందించలేదు. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకుడు.
This post was last modified on June 15, 2022 11:12 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…