కొన్ని కథలకు కొందరు హీరోలు బాగా కుదురుతారు. ముఖ్యంగా ప్రేమకథల విషయంలో అది బాగా తెలుస్తుంది. ఇక లవ్ స్టోరీస్ అంటే అక్కినేని ఫ్యామిలీ కి బాగా సూటవుతాయనే ముద్ర ఉంది. అందుకే నాగ చైతన్య ఎప్పటికప్పుడు ఏదో ఒక లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈ మధ్యే ‘లవ్ స్టోరి’ తో థియేటర్స్ లోకి వచ్చిన చైతు జులైలో ‘థాంక్యూ’ అనే ప్రేమకథతో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా టీజర్ చైతూ గత సినిమాలను గుర్తుచేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీజర్ తెలుగులో చైతు రీమేక్ చేసిన ‘ప్రేమమ్’ గుర్తుచేసింది. అలాగే టీజర్ లో కొన్ని షాట్స్ చూస్తే ‘మజిలీ’ కూడా తలపించింది.
ఇక తాజాగా చైతూ , మాళవిక ఇద్దరు కూర్చున్న స్టిల్ తో ఓ సాంగ్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్. ఆ పోస్టర్ లో చైతూ స్కూల్ డ్రెస్ తో ఉన్న స్టిల్ చూస్తే ‘మజిలీ’ లవ్ స్టోరి లానే అనిపిస్తుంది. మజిలీ సినిమాలో చైతు -సమంత మధ్య స్కూల్ లవ్ చూపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ చైతూ అలాంటి లవ్ ట్రాక్ తోనే వస్తున్నాడా ? అనిపిస్తుంది. కాకపోతే మజిలీలో చైతు సామ్ ని లవ్ చేయడు అక్కడ ఓన్లీ వన్ సైడ్ లవ్ చూపించారు. ఇక ‘థాంక్యూ’ ప్రేమమ్ సినిమా గుర్తుచేయడానికి రీజన్ ఇందులో కూడా వివిధ దశల ప్రేమాయణం ఉంది. చైతూ ముగ్గురితో ప్రేమలో ఉండే ట్రాకులు ఉన్నాయి. ప్రేమమ్ లో కూడా చైతు చేసింది ఇదే. కాకపోతే కథలు వేరయి ఉండొచ్చు స్క్రీన్ ప్లేలో ఏమైనా లైట్ గా చేంజ్ కనిపించొచ్చు అంతే.
ఈ సినిమా టీజర్ , స్టిల్స్ చూస్తుంటే చైతూ మళ్ళీ అలాంటి సినిమానే చేశాడని ఏమైనా కామెంట్స్ అందుకుంటాడా ? చైతు ఈ లవ్ స్టోరి చేయడం కరెక్టేనా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విక్రమ్ దర్శకుడు. మొన్నీ మధ్యే దర్శకుడిగా మారి మళ్ళీ గ్యాప్ తీసుకున్న బి వి ఎస్ రవి ఈ సినిమాకు కథను అందించాడు.
This post was last modified on June 14, 2022 8:51 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…