రెమ్యునరేషన్ వద్దని చెప్పిన సాయి పల్లవి తల్లి

తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఇప్పుడు ఆడియన్స్ అందరికీ ఫేవరేట్ హీరోయిన్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా సాయి పల్లవి డ్యాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె డ్యాన్స్ కోసమే సినిమాలు చూసే వాళ్ళ లిస్టు చాలానే ఉంది. అయితే ఈ రేంజ్ సక్సెస్ అందుకొని రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్న సాయి పల్లవి తాజాగా తన పెర్సనల్ విషయాలు కొన్ని బయట పెట్టింది.

నిజానికి సాయి పల్లవి రెమ్యునరేషన్ అంతా వాళ్ళ అమ్మ అకౌంట్ లోకి వెళ్ళిపోతుందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకుంది సాయి పల్లవి. అయితే ఒక్కోసారి ఆన్లైన్ లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ఓటీపి అమ్మకి వెళ్తుందని చెప్పింది.

ఇక తల్లిదండ్రులే తనకి చిన్నతనం నుండి ఏం కావాలో అది అందిస్తూ వచ్చారని ఇప్పుడు తన సంపాదన తన చేతిలో కాకుండా వాళ్ళ చేతిలో ఉంటేనే కూతురుగా తను హ్యాప్పీ అంటూ తెలిపింది. ఇక వాళ్లకి కూడా ఇప్పటికీ ఏది కావాలన్నా మనల్నే అడుగుతుందని ఓ మంచి ఫీలింగ్ ఉంటుందని అందుకే ఫైనాన్షియల్ మేటర్స్ అంతా వాళ్ళకే అప్పగించేశానని చెప్పుకుంది.

ఇక ఇంకో ఇంటరెస్టింగ్ విషయం కూడా చెప్పుకుంది సాయి పల్లవి. శర్వానంద్ తో నటించిన ‘పడి పడి లేచె మనసు’ సినిమా సక్సెస్ అవ్వలేదు కాబట్టి బ్యాలెన్స్ రెమ్యునరేషన్ వద్దని అమ్మ నిర్మాత సుధాకర్ గారితో చెప్పిందని కానీ ఆయన అమ్మ మాట వినకుండా బ్రతిమిలాడి మిగతా రెమ్యునరేషన్ క్లోజ్ చేశారని చెప్పుకుంది. సో సినిమా సక్సెస్ అవ్వకపోతే హీరోయిన్ ఇలా రెమ్యునరేషన్ వద్దని చెప్పడం సాయి పల్లవి విషయంలోనే జరిగి ఉండొచ్చు. ఏదేమైనా తన తల్లి దండ్రుల పట్ల ఇప్పటికే సాయి పల్లవి అదే ప్రేమ , గౌరవంతో ఉండటం మెచ్చుకోదగిన విషయమే.