Movie News

సెన్సేషనల్ సిరీస్.. సీక్వెల్ కన్ఫమ్

స్క్విడ్ గేమ్.. ఈ పేరు వింటే వెబ్ సిరీస్ ప్రియుల్లో ఒక రకమైన అలజడి కలుగుతుంది. ఆ కొరియన్ వెబ్ సిరీస్ ఇచ్చిన థ్రిల్, కిక్ అలాంటిలాంటివి కావు. వెబ్ సిరీస్‌ల చరిత్రలోనే అత్యంత ఆదరణ పొంది.. ఓటీటీల్లో వ్యూస్ పరంగా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసిన ఘనత ఈ సిరీస్ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో టాప్ క్వాలిటీ సినిమాలు, సిరీస్‌లకు పెట్టింది పేరైన కొరియా నుంచి వచ్చిన ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠకు, ఉద్వేగానికి గురి చేసేదే.

హ్వాంగ్ డాంగ్ హ్యూక్ రూపొందించిన ఈ సిరీస్ చిన్న పిల్లలను సైతం విపరీతంగా ఆకట్టుకుని.. దాని మీద ఎన్నో గేమ్స్ రావడానికి కూడా దోహదం చేసింది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత విజయవంతమైన సిరీస్‌కు సీక్వెల్ తీయకుండా ఉండరు కాబట్టి అది ఎప్పుడా అన్న ఉత్కంఠతో ఉన్నారు.

ఐతే ఉత్కంఠకు తెరదించుతూ నెట్ ఫ్లిక్స్ వాళ్లు ‘స్క్విడ్ గేమ్’ సెకండ్ సీజన్‌ను అనౌన్స్ చేశారు. దర్శకుడు డాంగ్ హ్యూక్ రెండో సీజన్ గురించి అధికారిక ప్రకటన చేశాడు. షూటింగ్ మొదలవుతోందని, తొలి సీజన్‌కు దీటుగా, ఉత్కంఠభరితంగా రెండో సీజన్ ఉండబోతోందని అతను ధీమా వ్యక్తం చేశాడు.

‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్ట్ చాలా షాకింగ్‌గా ఉంటుంది. మల్టీ మిలియనీర్లయిన కొంతమంది.. డబ్బు కోసం తహతహలాడుతున్న వ్యక్తులను ఎంచుకుని ఒక దీవిలోకి తీసుకొచ్చి వాళ్లతో డేంజరస్ గేమ్స్ ఆడిస్తారు. ఈ క్రమంలో తప్పులు చేసిన వాళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ డేంజరస్ గేమ్స్ చూసి ఆ మల్టీ మిలియనీర్లు వినోదం పొందుతుంటారు. ఆ గేమ్స్ సాగే వైనం.. తీవ్ర ఉత్కంఠతో ఉంటుంది. ఒక ఎపిసోడ్ మొదలుపెడితే.. అన్నీ చూసేదాకా వదల్లేని థ్రిల్, టెన్షన్ ఉంటుంది ఈ సిరీస్‌లో. మరి రెండో సీజన్ కూడా ఇంతే ఉత్కంఠభరితంగా ఉంటుందేమో చూడాలి.

This post was last modified on June 13, 2022 12:30 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago