బాలీవుడ్లో ఏ ఒక్క సంగీత దర్శకుడిదో ఆధిపత్యం నడిచి చాలా కాలం అయిపోయింది. అక్కడి ప్రేక్షకులను కూడా ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే సమాధానం చెప్పడానికి తడబడతారు. ఒక సినిమాకు నలుగురైదుగురు కలిసి పాటలు సమకూర్చడం.. నేపథ్య సంగీతం ఒకరు చేయడం.. ఇలా ఉంటోంది అక్కడి వరస. ఇప్పుడు అక్కడ ఏ ఒక్కరి ఆధిపత్యమో నడవట్లేదు.
దక్షిణాది విషయానికి వస్తే.. ఇక్కడ చాలామంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ వాళ్లందరిలో అనిరుధ్ ప్రస్తుత ఫామ్ ముందు ఎవ్వరూ నిలవలేరనే చెప్పాలి. తమిళంలో అతడికి దరిదాపుల్లో నిలిచే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరూ కనిపించడం లేదు. యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, డి.ఇమాన్, అలాగే మన దేవిశ్రీ ప్రసాద్ తమ స్థాయిలో సత్తా చాటుతున్నప్పటికీ అనిరుధ్ దూకుడు ముందు వీళ్లెవ్వరూ నిలవలేరనే చెప్పాలి.
ఇక తెలుగులో ఇప్పుడు తమన్ హవా నడుస్తోంది. అతను కూడా అనిరుధ్‌తో పోలిస్తే కిందే ఉంటాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎలాంటి ఫాంలో ఉన్నాడో చెప్పడానికి ఇటీవలే రిలీజైన ‘విక్రమ్’ సినిమా చాలు. ఇందులో ఉన్న రెండు మూడు పాటలు మామూలు కిక్కివ్వట్లేదు సినీ ప్రియులకు. ఇక నేపథ్య సంగీతం గురించైతే చెప్పాల్సిన పనిలేదు. మాస్, యాక్షన్ సన్నివేశాలను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి నిలబెట్టేశాడు అనిరుధ్.
ఈ ఏడాది కేఆర్కే, డాన్ సినిమాల్లోనూ తన సంగీతంతో అదరగొట్టాడు అనిరుధ్. ఐతే ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తయితే.. ఎన్టీఆర్-కొరటాల సినిమా, షారుఖ్ ఖాన్ ‘జవాన్’.. రజినీకాంత్, అజిత్‌ల కొత్త సినిమాలు.. ఇలా అతడి చేతిలో క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. మున్ముందు అతడి పేరు జాతీయ స్థాయిలో మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on June 13, 2022 3:10 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…