తమిళ దర్శకులు వచ్చి తెలుగులో సినిమాలు చేయడం, హిట్లు కొట్టడం మామూలే. ఇది దశాబ్దాల కిందటే జరిగింది. కానీ తెలుగు దర్శకులు తమిళంలో, అక్కడి స్టార్లతో సినిమాలు చేయడం.. హిట్లు కొట్టడం అంటే ఆశ్చర్యపోయి చూడాల్సిందే. ఇప్పుడు అనుకోకుండా ఇద్దరు దర్శకులు కోలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు.
అందులో ఒకరు ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కాగా.. మరొకరు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్‌దె చిత్రాల డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇందులో ముందుగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నది అనుదీపే. తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌తో అతను తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్రిన్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు తాజాగా. ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కూడా లాంచ్ చేశారు.
ఇందులో ఓ విదేశీ అమ్మాయి కథానాయికగా నటిస్తోంది. ఆమెతో కలిసి శివ ఉన్న కొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం పాండిచ్చేరి నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కుతోంది. అక్కడి నేపథ్యానికి తగ్గట్లుగా ఫారిన్ అమ్మాయితో ప్రేమలో పడ్డ కుర్రాడి కథలా కనిపిస్తోందిది. టైటిల్, ఫస్ట్ లుక్ అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. శివకార్తికేయన్ డాక్టర్, డాన్ లాంటి బ్లాక్‌బస్టర్లతో మంచి ఊపుమీదున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి.
దీంతో ‘ప్రిన్స్’ పట్ల పాజిటివ్ బజ్ నెలకొంది. అనుదీప్ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. అతడి నమ్మకం ఫలించి, అన్నీ కలిసొచ్చి అతను హిట్ కొట్టగలిగితే.. కోలీవుడ్లో హిట్ కొట్టిన అచ్చ తెలుగు దర్శకుడిగా అనుదీప్ రికార్డుల్లోకెక్కుతాడు. పాత కాలంలో కొందరు దర్శకులు తమిళంలో సినిమాలు చేశారు కానీ.. గత మూడు దశాబ్దాల్లో అయితే ఏ తెలుగు దర్శకుడూ తమిళంలోకి వెళ్లి సినిమాలు చేసి విజయం సాధించిన దాఖలాలు కనిపించవు. మరి అనుదీప్ రికార్డ్ కొడతాడేమో చూడాలి.
This post was last modified on June 11, 2022 1:11 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…