ఎప్పుడో జనవరి చివరి వారం థియేటర్లలో విడుదల కావాల్సిన కిన్నెరసాని ఈ రోజు ఏ హడావిడి లేకుండా జీ5లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అందుకుంది. దీని గురించి కనీస పబ్లిసిటీ చేయకపోవడంతో అసలు వచ్చిందనే సంగతి ఓటిటి అప్డేట్స్ ని ఫాలో అయ్యేవాళ్ళకు తప్ప ఎవరికీ తెలియకుండా పోయింది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడి బ్రాండ్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్ కి ఇది మూడో సినిమా. ఆ ఫ్యామిలీతో గత కొంత కాలంగా సత్సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టే ఈ కిన్నెరసానిని ఎవరూ పట్టించుకోకపోవడం ఇంకో ట్విస్ట్. నాగ శౌర్యతో అశ్వద్ధామ తీసిన రమణ తేజ దర్శకుడు కాగా రామ్ తాళ్ళూరి నిర్మాత.
ఇదో సైకో పాత్ కథ. వేదా(ఆన్ శీతల్)హైదరాబాద్ లో ప్రైవేట్ లైబ్రరీ నడుపుతూ ఉంటుంది .లాయర్ విక్రమ్(కళ్యాణ్ దేవ్) ఆమె స్నేహితుడు. చిన్నప్పుడు తనను తల్లిని చంపాలనుకుని తర్వాత జైలుకి వెళ్లి కనిపించకుండా పోయిన తండ్రి(రవీంద్ర విజయ్) కోసం వెతుకుతూ ఉంటుంది వేదా. ఈలోగా తన పేరు మీద ఉన్న అమ్మాయిలు హత్యకు గురవుతున్నారని వాటి వెనుక భయంకరమైన నిజం ఉందని తెలుస్తుంది. నిజానిజాలు తెలుసుకునే క్రమంలో విక్రమ్ వేదాలు ఎన్నో ప్రమాదాలు ఎదురుకుంటారు. అసలు ఇంతకీ హంతకుడు ఎవరు, వేదాతో పాటు విక్రమ్ లైఫ్ ని రిస్క్ లో ఎందుకు పెట్టాలనుకున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానమే కిన్నెరసాని.
సినిమా ఓటిటిలో చూశాక థియేటర్లో వచ్చి ఉంటే ఎలాంటి ఫలితం దక్కేదో ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ కొంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తర్వాత వచ్చే కీలక మలుపులతో సహా అంతా ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కథనం మరీ నత్తనడక సాగించడంతో చప్పగా సాగిపోతుంది. మహతి స్వరసాగర్ నేపధ్య సంగీతం కొంతవరకు తోడ్పడినా లాభం లేకపోయింది. ఇలాంటి జానర్లను ఇష్టపడే ఆడియన్స్ ని సైతం పెద్దగా థ్రిల్ చేసే మెటీరియల్ ఇందులో కనిపించదు. కల్కి ఫేమ్ దేశరాజు ఆత్రేయస రచనలో ఎలాంటి మెరుపులు లేవు. ఓటిటి కాబట్టి సరిపోయింది కానీ లేదంటే కిన్నెరసాని పరిస్థితి ఇంకోలా ఉండేదని చెప్పడం సందేహం అక్కర్లేదు .
This post was last modified on June 10, 2022 8:01 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…