ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన జనగణమనకు ఆన్ లైన్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ టైటిల్ ఆల్రెడీ తెలుగులో పూరి జగన్నాధ్ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఆ మూవీకి తెలుగులో జన అని పెట్టి మేనేజ్ చేస్తున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం అసలు పేరుతోనే చర్చ జరుగుతోంది. నిజానికి ఒరిజినల్ మలయాళం వెర్షన్ రిలీజైనప్పుడు హైదరాబాద్ తో సహా పలు ప్రధాన నగరాల్లో థియేటర్లు ఇచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా కొన్ని స్క్రీన్లలో తెలుగు డబ్బింగ్ కూడా ఆడింది. కానీ టీమ్ ఎక్కడా పబ్లిసిటీ చేయలేదు.
దీంతో అది వచ్చి వెళ్లిందన్న సంగతి ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ జనగణమన కేరళలో పెద్ద హిట్టు. యాభై కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. అలా అని ఇది కమర్షియల్ మూవీ కాదు. కానీ మన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోతోంది. ఇటీవలే జరిగిన టీనేజ్ అమ్మాయిల మీద రేప్ ఉదంతాలు, కొన్నేళ్ల క్రితం నగర శివార్లలో జరిగిన ఎన్ కౌంటర్ లాంటి సంఘటనలు ఇందులో రియలిస్టిక్ గా చూపించారు. అంతేకాదు యునివర్సిటీల్లో జరిగే విద్యార్థులు భావజాలాలు అంతర్యుద్ధాలు బాగా ఆవిష్కరించారు.
అందుకే చక్కగా తెలుగు ఆడియో పెట్టేసుకుని ఈ సినిమాను చూసేస్తున్నారు. ఓ లేడీ ప్రొఫెసర్ దారుణ హత్యకు గురైతే దాని వెనుక ఉన్న కారణాలు ఎన్నో చీకటి నిజాలను బయటికి తీస్తాయి. అదే ఇందులో మెయిన్ పాయింట్. ఆర్ఆర్ఆర్, గంగూబాయ్ కటియావాడిలతో పోటీ పడుతూ నెట్ ఫ్లిక్స్ టాప్ 5లో ఈ చిత్రం కొనసాగుతోంది. పృథ్విరాజ్ సుకుమారన్ మరోసారి పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు. చింతకాయల రవి,యమదొంగ సినిమాల్లో మనకూ పరిచయమున్న మమతా మోహన్ దాస్ ఇందులో లీడ్ క్యారెక్టర్.