మెగాస్టార్ చిరంజీవి , మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ చుట్టూ నిన్నటి వరకూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. సినిమా ఆగిపోయిందని కొందరు , లేదు లేదు దర్శకుడు మారబోతున్నాడు అంటూ మరికొందరు గాసిప్స్ క్రియేట్ చేసి వదిలారు. దీంతో మెగా ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. షూటింగ్ స్టేజిలో ఉన్న చిరు సినిమా ఆగిపోయిందా ? ఇదేంటి అనుకున్నారు.
ఈ వార్తలు అటు తిరిగి, ఇటు తిరిగి ఎట్టకేలకు మేకర్స్ చెవిలో పడ్డాయి. దీంతో మేకర్స్ వెంటనే ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. అయితే సినిమా రూమర్స్ గురించి ప్రస్తావించకుండా డైరెక్ట్ గా షెడ్యుల్ డీటెయిల్స్ చెప్పారు. జూన్ 21 నుండి కొత్త షెడ్యుల్ ప్రారంభం కానుందని ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. నిజానికి ఇలాంటి పుకార్లు బడా సినిమాలకు కొత్తేమి కాదు.
కానీ మెగా స్టార్ సినిమాకు మాత్రం కొత్తే. చిరు అప్ కమింగ్ సినిమాల్లో ‘భోళా శంకర్’ మీద కాస్త నెగిటివిటీ ఉంది. మెహర్ ఈ సినిమాను ఎలా తీస్తారో అని మెగా ఫ్యాన్స్ కూడా సందేహ పడుతున్నారు. వారిలో ఎవరో ఒకరు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చు.
ఏదేమైనా చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ బిజీ అవ్వబోతున్నాడు.
స్మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ వరుస షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఇటు బాబీ సినిమా అటు మెహర్ సినిమా షెడ్యుల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. బాబీ సినిమా త్వరలోనే మలేషియాలో భారీ షెడ్యుల్ జరుపుకోనుంది. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చిరు మాస్ లుక్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది.
This post was last modified on June 9, 2022 10:47 pm
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…