Movie News

చిరుపై ఇంకా ఒత్తిడి పెంచేసిన కమల్

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కెరీర్లో ఎన్నడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్లో తిరుగులేని హవా సాగించి, రాజకీయాల కారణంగా పదేళ్లు విరామం తీసుకుని.. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో సత్తా చాటడంతో చిరుకు తిరుగులేదని అందరూ కొనియాడారు అందరూ. కానీ ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రం చేసిన చిరు.. ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయారు.

ఐతే ఆ సినిమాతో చిరు మీద మోయలేని భారం మోపడం ప్రతికూలంగా మారింది. కాబట్టి నాలుగు బ్లాక్‌బస్టర్లు కొట్టిన కొరటాల శివతో చేస్తున్న ‘ఆచార్య’తో చిరు బౌన్స్ బ్యాక్ అవుతారని, ఈ సినిమా కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. చిరు కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీంతో చిరు ఒక్కసారిగా ఒత్తిడిలో పడిపోయాడు. ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఈ ప్రభావం గట్టిగానే పడింది.

స్వయంగా అభిమానులే ఎన్నాళ్లీ మూస, మాస్ సినిమాలు చేస్తారనే ప్రశ్నలు చిరుకు సంధిస్తున్నారు. మెహర్ రమేష్‌తో చేస్తున్న ‘భోళా శంకర్’ను అందరూ వ్యతిరేకిస్తున్నారు. అసలే కెరీర్ అంతంతమాత్రంగా ఉన్న టైంలో ఈ రీమేక్‌లు, రొటీన్ మాస్ మసాలా సినిమాలు అవరామా అంటున్నారు. అసలు చిరు ఇంకా ఈ ఫార్మాట్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు.. కమర్షియల్ హంగుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు..

మోహన్ లాల్ లాగా కథ ప్రధానంగా సాగే వైవిధ్యమైన సినిమాల్లో నటించవచ్చు కదా.. తనలోని నటుడిని సంతృప్తిపరుచుకుని ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతిని ఇవ్వొచ్చు కదా అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే ఈ రకమైన ఒత్తిడి ఆయన మీద ఉండగా.. తాజాగా కమల్ ‘విక్రమ్’లో ఇలాగే వైవిధ్యమైన పాత్రతో భారీ విజయాన్నందుకోవడంతో మెగాస్టార్ మీద ఇంకా ఒత్తిడి పెరిగిపోయింది. చిరుతో పాటు సీనియర్ హీరోలందరికీ ‘విక్రమ్’తో కమల్ పాఠాలు నేర్పారు. కానీ అందరికంటే ఎక్కువగా చిరు మీదే కమల్ ఎక్కువ ప్రెజర్ పెంచేశారన్నది స్పష్టం.

This post was last modified on June 9, 2022 1:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

5 hours ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

6 hours ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

7 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

8 hours ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

9 hours ago

టీడీపీపై తెలంగాణకు ఆశ చావలేదు!

అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…

10 hours ago