ఆచార్య ఎపిక్ డిజాస్టర్ తర్వాత విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నష్టాల తాలూకు లావాదేవీల గురించి దర్శకుడు కొరటాల శివతో ఒక దఫా చర్చలు పూర్తయినట్టు సమాచారం. ఇంకొద్ది రోజుల్లో దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తెస్తారట. సరే ఇలాంటి ఫ్లాపులు చూడటం ఏ స్టార్ హీరోకైనా సహజమే కానీ ఆచార్య మాత్రం చాలా స్పెషల్ కేస్ గా నిలవడం చిరుని పునరాలోచనలో పడేసిందని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.
దానికి కారణాలు లేకపోలేదు. ఈ పరాజయం తన ఇమేజ్ మాత్రమే ఓపెనింగ్స్ తేలేదని స్పష్టం చేసింది. చాలా చోట్ల బెనిఫిట్ షోలు సైతం ఫుల్ కాకపోవడాన్ని కొందరు వీరాభిమానుల నుంచి తెప్పించుకున్న స్పెషల్ రిపోర్ట్స్ సహాయంతో విశ్లేషణ చేస్తున్నారట. అసలు ఒక్క షో కూడా పూర్తి కాకుండా ఇంత నెగటివ్ వైబ్రేషన్లు జనంలోకి ఎలా వెళ్లాయనే దాని మీద వివిధ అభిప్రాయాలు సేకరించి వాటికి తన అనుభవాన్ని జోడించి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. ఇందులో చాలా దగ్గరివాళ్ళు ఉన్నట్టు వినికిడి.
ఇవన్నీ పోస్ట్ మార్టం చేశాక మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ ని తేలిగ్గా తీసుకోవడానికి లేదని అర్థమైపోయిందట. ఏదో హిట్ కొట్టిన రీమేక్ కదా కాస్త మాసాలాలు జోడిస్తే చాలు ఆడేస్తుందనే నమ్మకం ఇప్పుడు సన్నగిల్లి ఉండొచ్చు. అందుకే గాడ్ ఫాదర్ ఎలాగూ పూర్తయ్యింది కాబట్టి ముందుగా స్ట్రెయిట్ మూవీ వాల్తేర్ వీరయ్య మీద సీరియస్ ఫోకస్ పెట్టి ఆ తర్వాత భోళా శంకర్ సంగతి చూస్తారు. అందుకే కీర్తి సురేష్, తమన్నాలతో సహా కీలక ఆర్టిస్టుల కాల్ షీట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదని తెలిసింది. ఇదేమో కానీ అసలు భోళా శంకర్ ప్రాజెక్టే క్యాన్సిల్ అయ్యిందనే పుకారు సోషల్ మీడియా ఊపందుకోవడం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on June 9, 2022 9:36 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…
టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చెప్పుకునే అర్జున్ రెడ్డికి సంగీత దర్శకుడు రధన్ ఇచ్చిన పాటలు ఎంత…
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా…