నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘అంటే సుందరానికీ’ విడుదలకు ముస్తాబైపోయింది. ఇంకో రెండు రోజుల్లోనే ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలో విడుదల ముంగిట అత్యంత ముఖ్యమైన తంతుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్‌లో గురువారం ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటం విశేషం.
రెండు రోజుల ముందే ఈ సమాచారం బయటికి వచ్చింది కానీ.. తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి బుధవారమే ఈ వేడుక జరగాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌కు కుదరకపోవడం వల్లే ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌తో పవన్ కళ్యాణ్ బంధం చాలా ఏళ్ల ముందే మొదలైంది. ఆ బేనర్లో ఓ సినిమా చేయడానికి పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడు. ఐతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరుగుతోంది.
రెండేళ్ల కిందట ఈ బేనర్లో పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీని అనౌన్స్ చేశారు. కానీ పవన్ వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా లేటవుతోంది. దీని వల్ల మైత్రీ వాళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు అడిగేసరికి ఈ సాయం చేయడానికి పవన్ ముందుకు వచ్చినట్లున్నారు. అలాగే ఈ వేడుక ద్వారా ఆ సినిమా పరంగా పవన్ నుంచి ఏదైనా హామీ లభిస్తుందేమో అని కూడా మైత్రీ వాళ్లు చూస్తుండొచ్చు. ఇక ఈ వేడుకకు పవన్ రావడంలో మరో కోణం కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరల విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కారును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టాక.. ఆ దిశగా గొంతు కలిపింది టాలీవుడ్ హీరోల్లో ఒక్క నాని మాత్రమే. దీని వల్ల అతను చాలా ఇబ్బంది పడ్డాడు కూడా. ఈ నేపథ్యంలో అతడికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా పవన్ ఈ వేడుకకు అతిథిగా వస్తుండొచ్చు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ నానీని బాగా ఓన్ చేసుకోవచ్చు. కానీ నాని వెనుక పవన్ ఉండడం వల్ల ఈ యంగ్ హీరోను ఏపీ ప్రభుత్వం, వైకాపా వర్గీయులు మరింతగా టార్గెట్ చేస్తారేమో, ఆన్ లైన్-ఆఫ్ లైన్లో సినిమాను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారేమో అన్న భయాలు కూడా కలుగుతున్నాయి. చూడాలి ఏమవుతుందో మరి.
This post was last modified on June 8, 2022 9:28 pm
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…