Movie News

దర్శకులను పెళ్ళాడిన హీరోయిన్లు

రేపు భార్యాభర్తలు కాబోతున్న నయనతార విజ్ఞేశ్ శివన్ ల వివాహ వేడుక కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరిమిత అతిథుల మధ్య మహాబలిపురంలో జరగబోయే ఈ పెళ్లి గురించి కొన్నాళ్ల పాటు ముచ్చట్లు కొనసాగేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇలా దర్శకుడిని హీరోయిన్లు పెళ్లి చేసుకోవడమనేది గతంలో ఉందానే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం సహజం. అవేంటో చూద్దాం.

ప్రస్తుత ఏపి మంత్రి ఒకప్పటి హీరోయిన్ రోజా శ్రీవారు ఆర్కె సెల్వమణి గురించి ఇప్పటి యూత్ కి అంతగా ఐడియా లేకపోవచ్చు కానీ ఆయనకు ఒకప్పుడు 90 దశకంలో విజయ్ కాంత్ కి కెప్టెన్ ప్రభాకర్, పోలీస్ అధికారి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉంది. చామంతి తీస్తున్న టైంలో ఇద్దరికీ ప్రేమ మొదలైంది. ఇది ఎంతగా అంటే రోజా సమరం సినిమాని కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసేంత దాకా వెళ్ళింది.

అది డిజాస్టర్ అవ్వడం, తీవ్ర నష్టాలు రావడం వేరే కథ. తర్వాత వీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో హీరోయిన్ దేవయాని గుర్తుందిగా. ఇప్పటికీ ఆవిడ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.2001లో తమిళంలో తన డెబ్యూ మూవీ సూరియవంశం దర్శకుడు రాజకుమారన్ ని సుదీర్ఘమైన లవ్ స్టోరీ తర్వాత వివాహం చేసుకున్నారు.

వెంకటేష్ కలియుగ పాండవులుతో హీరోయిన్ గా పరిచయమైన ఖుష్బూ స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం చూశాం. ఈవిడ భర్త సి సుందర్ ప్రముఖ దర్శకులు. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ అరుణాచలం తీసింది తనే. సుందర్ మొదటి సినిమా మురై మామన్ లో ఖుష్బూనే హీరోయిన్. లెజెండరీ డైరెక్టర్ కె భాగ్యరాజ్ ని పెళ్లాడింది అప్పటి కథానాయిక పూర్ణిమనే. ఇక మణిరత్నం సుహాసిని జంట గురించి తెలియని వారు ఉంటారా. మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ముడి వేసుకున్నారు. కనులు కనులను దోచాయంటే దర్శకుడు దేసింగ్ పెరియస్వామి పెళ్లాడిన నిరంజని కూడా ఆ సినిమాలోని కీలకమైన ఆర్టిస్ట్ కావడం ఫైనల్ ట్విస్ట్ 

This post was last modified on June 8, 2022 7:33 pm

Share

Recent Posts

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago