రేపు ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ రాకతో ఆ సినిమాకు ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరగడం ఖాయం. కాకపోతే గత కొంత కాలంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల ప్రస్తావన తేకుండా మాట్లాడలేకపోతున్న పవన్ ఇప్పుడీ వేదిక మీద ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
అందులోనూ టికెట్ రేట్ల వివాదం చెలరేగినప్పుడు నాని కూడా అప్పట్లో కొన్ని కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొంత ట్రోలింగ్ ని కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. అదంతా గతం. ఇప్పుడూ నాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోలేదు కానీ విపరీత ధరలకు టికెట్లు అమ్మడం గురించి తప్పనే చెప్పడం విశేషం.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారానికి సంబంధించి మాములు పరిస్థితులు నెలకొన్నాయి. ఏపిలో ప్రత్యేకమైన సినిమాలకు తప్ప ఎలాంటి పెంపులు ఇవ్వడం లేదు. కాబట్టి ఎఫ్3, అంటే సుందరంలు రెగ్యులర్ రేట్లకే వెళ్లాయి. ఎటొచ్చి తెలంగాణలో మాత్రమే ఇదింకా నానుతూనే ఉంది. ఒక పద్ధతి ప్రకారం లేని హైక్స్ థియేటర్ ఫుట్ ఫాల్స్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇదంతా ఎలా ఉన్నా పవన్ నాని గురించి సినిమా గురించి మాత్రమే మాట్లాడే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టైంలో అవసరానికి మించిన ఆవేశానికి పోవడం ఎలాంటి ఇబ్బందులను సృష్టించిందో తనకు తెలియంది కాదు. అందులోనూ అంటే సుందరం మెగా ఫ్యామిలీ మూవీ కాదు. ఇది దృష్టిలో ఉంచుకునే ప్రసంగం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. మైత్రితో ఎప్పటి నుంచో ఒక సినిమా బాకీ ఉన్న పవన్ అదెప్పుడు తీరుస్తాడో తెలియడం లేదు. సుజిత్ తో ఏదో తమిళ రీమేకని వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు
This post was last modified on June 8, 2022 3:29 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…