అంతా అయిపోయింది ఓటిటిలో కూడా వచ్చేసింది కదాని ఆర్ఆర్ఆర్ కథ అక్కడితో ముగిసిపోలేదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్తోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన హిందీ వెర్షన్ దేశ విదేశాల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడంతో సబ్ టైటిల్స్ సహాయంతో బాషతో సంబంధం లేకుండా హాలీవుడ్ టెక్నీషియన్లు దర్శకులు క్రీడాకారులు జర్నలిస్టులు ఒకటా రెండా అన్ని రంగాల వారు చూడటమే కాక ప్రత్యేకంగా ట్వీట్లు పెట్టి మరీ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. ఏ తెలుగు సినిమాకు ఇలా జరగలేదు.
డాక్టర్ స్ట్రేంజ్ లాంటి బ్లాక్ బస్టర్స్ కు రచయితగా పని చేసిన రాబర్ట్ కార్గిల్ ఆర్ఆర్ఆర్ గురించి చెబుతూ ఇంత అద్భుతమైన చిత్రాన్ని తానెప్పుడూ చూడలేదని, ఈ వీకెండ్ లో భార్యతో కలిసి మరోసారి ఎంజాయ్ చేయబోతున్నట్టు చెప్పడం చూస్తే రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యుఎస్ లో ఎన్కోర్ పేరుతో థియేటర్లలో వేస్తున్న రీ రిలీజ్ ప్రీమియర్లు సైతం మంచి ఆక్యుపెన్సీతో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ముందు ఒకటి రెండు షోలు పరిమితం అనుకున్నా తర్వాత పెంచుకుంటూ పోయారు. మొత్తానికి రెండు నెలల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ టాక్ అఫ్ ది వరల్డ్ గా నిలవడం చిన్న విషయం కాదు.
ఇందులో నెట్ ఫ్లిక్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందని కొందరు అనుకున్నా ఇంతకన్నా భారీ సినిమాలు అందులో స్ట్రీమింగ్ జరిగినప్పుడు ఇలాంటి ట్రెండ్ ఎప్పుడూ చూడలేదు. సో ఇది జెన్యూన్ గా వస్తున్న రెస్పాన్సేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. డిజిటల్ వరల్డ్ లో బాహుబలి, కెజిఎఫ్ లకు రాని స్పందన ట్రిపులార్ కే రావడం చూస్తే రాజమౌళి మాయాజాలానికి ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు వచ్చినట్టే.
This post was last modified on June 7, 2022 1:27 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…