ట్రైలర్ తో బజ్ వచ్చేసింది

రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు ఉడుగుల తెరకెక్కించిన ‘విరాట పర్వం’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతుంది . ఇప్పటి వరకూ ఈ సినిమాకు ఊహించిన బజ్ లేదు. కానీ ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. సోషల్ మీడియాలో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఉన్నపళంగా ‘విరాటపర్వం’ హాట్ టాపిక్ అయింది. ఇక కర్నూల్ లో ఈవెంట్ నిర్వహించడం అక్కడ వర్షంలో తడుస్తూ సాయి పల్లవి మాట్లాడుతుంటే రానా గొడుగు పట్టుకోవడం విజువల్ కూడా వైరల్ అయింది.

‘విరాట పర్వం’ చాలా నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ముందుగా జులై 1న రిలీజ్ అనుకొని ప్రకటించారు. కానీ ఇప్పుడు జూన్ 17 న స్లాట్ ఖాళీగా ఉండటంతో వెంటనే ప్రీ పోన్ చేసుకొని ముందుకొచ్చారు. ఇక ట్రైలర్ తో సినిమాపై బజ్ తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. త్వరలోనే టీం ఇంకా భారీ ఎత్తున ప్రమోషన్ చేయబోతున్నారట.

‘నీది నాది ఒకే కథ’ లాంటి మంచి ఫీల్ గుడ్ సినిమా తీసి దర్శకుడిగా గుర్తింపు అందుకున్న వేణు ఉడుగుల నుండి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో కొన్ని కారణాల వల్ల వర్క్ ఆగుతూ వచ్చింది. తర్వాత రిలీజ్ డేట్ కుదరక వాయిదా పడుతూ ఇప్పుడు ఫైనల్ గా 17న రాబోతుంది. మరి వరుస అపజయాలతో సతమవుతున్న రానా సాయి పల్లవితో కలిసి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో లెట్స్ వైట్ అండ్ సీ.