స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు తమ ఫ్యామిలీ మూలపురుషులతో కలిసి నటించడం వాటి మీద అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టేసుకోవడం సహజమే. కాకపోతే అధిక సందర్భాల్లో ఇవి నిరాశ కలిగించే ఫలితాలనే ఇచ్చాయి. మొన్నామధ్య వచ్చిన ఆచార్యలో చిరంజీవి చరణ్ కలిసి డాన్స్ చేసినా లాభం లేకపోయింది. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబులు కలిసి వంశీ చేస్తే అదీ తేడా కొట్టింది. ఎన్టీఆర్ బాలకృష్ణలు కలిసి చేసినవాటిలో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ. ఏఎన్ఆర్ నాగ్ కాంబోలోనూ అంతే.
పైన చెప్పిన ఏ కలయికకు ఆల్ టైం బ్లాక్ బస్టర్లు లేవు. దానవీరశూరకర్ణ, మనం లాంటి కొన్నింటిని మినహాయించవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఆది పురుష్. ఇందులో కృష్ణం రాజు ఓ కీలక పాత్ర చేశారనే టాక్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో బిర్లా ఓ మోస్తరుగా ఆడగా రెబెల్ ఘోరంగా దెబ్బ తింది. ఇక రాధే శ్యామ్ సంగతి సరేసరి. పెద్దాయనని ఇబ్బంది పెట్టడమే కాదు అంత కష్టపడినా కూడా కనీసం యావరేజ్ ఫలితం కూడా దక్కినంత దారుణంగా ఫెయిల్ అయ్యింది.
ఆది పురుష్ లో సీత తండ్రి మిథిలాధిపతి జనకుడిగా కృష్ణంరాజుగారు కనిపిస్తారని టాక్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ లీకైన సోర్స్ నుంచి అందుతున్న సమాచారం నమ్మదగినదే. ఓం రౌత్ దర్శకత్వంలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రామాయణ ఆధారిత గ్రాండియర్ కి సంబంధించిన కనీసం ఫస్ట్ లుక్ ఇప్పటిదాకా విడుదల కాలేదు. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం మీద కూడా క్లారిటీ లేదు. టాకీ పార్ట్ అయితే పూర్తి చేశారు కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఉన్నాయట మరి.
This post was last modified on June 6, 2022 3:42 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…