ఒకప్పటి తమిళ సినిమా వైభవం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారతీరాజా, బాలు మహేంద్ర, మణిరత్నం, శంకర్ లాంటి మేటి ఫిలిం మేకర్లు తమిళ సినిమా కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. తర్వాతి తరంలోనూ ఎందరో గొప్ప దర్శకులు ఆ వారసత్వాన్ని కొనసాగించారు. అక్కడి హీరోలు కూడా మంచి అభిరుచితో సినిమాలు చేసి తమిళ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ గత దశాబ్దంలో పరిస్థితులు మారిపోయాయి. మణిరత్నం, శంకర్, మురుగదాస్ సహా చాలామంది స్టార్ డైరెక్టర్లు తమ స్థాయికి తగ్గ సినిమాలు చేయకపోవడం.. మిగతా డైరెక్టర్లు కూడా ట్రాక్ తప్పడంతో తమిళ చిత్రాల క్వాలిటీ బాగా పడిపోయింది.
గత కొన్నేళ్లలో నిలకడగా ఉత్తమ స్థాయి చిత్రాలు తీసిన దర్శకుడంటే ఒక్క వెట్రిమారన్ మాత్రమే. కాకపోతే అతడి సినిమాల్లో కమర్షియల్ హంగులు తక్కువ. కంటెంట్ ప్రధానంగా సాగే అతడి చిత్రాల్లో మాస్ ప్రేక్షకులు కోరుకునే ఎలివేషన్లు, మసాలాలు ఉండవు. వీటికి పెద్ద పీట వేసే దర్శకులేమో వైవిధ్యం చూపించలేకపోతున్నారు.
ఇలాంటి టైంలో ఒక దర్శకుడు మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఓవైపు వైవిధ్యం చూపిస్తూనే.. ఇంకో వైపు కమర్షియల్ హంగులు, ఎలివేషన్లకు కూడా లోటు లేకుండా చూస్తూ తమిళ ప్రేక్షకులతో పాటు మిగతా ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నాడు. రోజు రోజుకూ క్వాలిటీ పడిపోతున్న తమిళ సినిమాకు సేవియర్‌గా మారిన ఆ దర్శకుడే లోకేష్ కనకరాజ్. సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించిన ‘మానగరం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు లోకేష్. తమిళంలో ఈ చిత్రం సూపర్ హిట్టయింది. ఐతే లోకేష్ పేరు మార్మోగేలా చేసింది మాత్రం.. ఖైదీ మూవీనే అని చెప్పాలి.
కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అయింది. ఆ సినిమా కథలోని వైవిధ్యం, ఎమోషన్, అందులోని యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్లకు ప్రేక్షకుల మతి పోయింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. దీంతో విజయ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు లోకేష్. వీరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ కంటెంట్ పరంగా కొంత నిరాశపరిచినప్పటికీ సూపర్ హిట్టయింది. లోకేష్ ఈ సినిమాతో అంచనాలను అందుకోలేకపోయాడని చెప్పాలి.
కానీ ఆ లోటును ఇప్పుడు ‘విక్రమ్’తో తీర్చేసుకున్నాడు. కమల్ హాసన్‌ను ఆయన స్థాయికి తగ్గ పాత్రలో చూపించి, వైవిధ్యమైన కథ, బిగి ఉన్న కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు లోకేష్. ఈ సినిమాతో అతడి పేరు మార్మోగిపోతోంది. తమిళంలో ‘విక్రమ్’ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటయ్యేలా కనిపిస్తోంది. ‘విక్రమ్’తో మళ్లీ తమిళ సినిమా గురించి అందరూ మాట్లాడుకునే పరిస్థితి రావడంతో లోకేష్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on June 6, 2022 2:00 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…