విక్రమ్ ప్రమోషన్లలో భాగంగా తెలుగులోనూ విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కమల్ హాసన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా గురించి స్టార్ డం గురించి చేస్తున్న కామెంట్స్ ఆలోచింపజేసేలా ఉంటున్నాయి. సినిమాలకు అందులోనూ సౌత్ హీరోలకు యునివర్సల్ అప్పీల్ ఎప్పుడూ ఉంటుందని కాకపోతే ఫలానా భాషలోనే నటించాలని కొందరు నిర్ణయించుకోవడం వల్ల రీచ్ మిస్ అవుతోందే తప్ప ఇంకో లాంగ్వేజ్ లో వాళ్ళని చూడరని కాదని వివరణ ఇచ్చారు.
దానికి ఉదాహరణగా చిరంజీవి గురించి చెప్పుకొచ్చారు. ఒకవేళ చిరు కనక తమిళనాడులో సినిమాలు చేసుంటే అక్కడా స్టార్ అయ్యేవారని కానీ ఆయన ఆలోచనా లక్ష్యం వేరుగా ఉండటం వల్ల ఇక్కడికే పరిమితమయ్యారని వివరించారు. కమల్ అన్నదాంట్లో లాజిక్ ఉంది. తన మార్కెట్ పీక్స్ లో ఉన్న టైంలోనే తెలుగులో చేసిన స్ట్రెయిట్ మూవీస్ స్వాతిముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు, ఒక రాధా ఇద్దరు కృష్ణులు ఇక్కడ అద్భుత విజయాలు సాధించాయి. లోకనాయకుడికి ప్రత్యేకంగా ఫాలోయింగ్ పెంచాయి.
కానీ చిరంజీవి ఏనాడూ పక్క భాషల్లో చేయాలని ఆలోచించలేదు. రజనీకాంత్ మాపిళ్ళైలో చిన్న గెస్ట్ రోల్ చేయడం, రవిచంద్రన్ సిపాయిలో క్యామియోగా మెరవడం తప్ప వాళ్ళ ఆఫర్స్ కి నో అన్న సందర్భాలే ఎక్కువ. ఇప్పుడు కమల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ మధ్య వైరల్ అయ్యాయి. చిరుతో కమల్ కి మంచి బాండింగ్ ఉంది. ఇద్దరూ కలిసి ఇది కథ కాదులో నటించారు. దర్శకుడు వెంకీ కుడుముల త్వరలో చేయబోయే మెగా మూవీకి సంబంధించి కూడా కమల్ పలు సూచనలు చేయడం విశేషం.
This post was last modified on June 5, 2022 7:36 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…