అదేంటో కొందరికి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినా అవకాశాల కరువు తగులుతుంది. మరికొందరికేమో పది లక్షల రెమ్యునరేషన్ ఏకంగా రెండు కోట్లకు చేరుకుంటుంది. పరిశ్రమ తీరే అంత. సక్సెసే కొలమానం అయినప్పటికీ ఒక్కోసారి ఇతరత్రా అంశాలు దాన్ని ప్రభావితం చేస్తుంటాయి. జాతిరత్నాలు సుందరి ఫరియా అబ్దుల్లాకు అచ్చం ఇలాంటి పరిస్థితి వచ్చి పడింది. సరైన ఆఫర్స్ లేక ఆ మధ్య బంగార్రాజులో నాగార్జున, నాగ చైతన్యతో స్పెషల్ సాంగ్ చేసింది గుర్తేగా. పాట హిట్టయ్యింది కానీ తనకు ఒరిగిందేమీ లేదు.
తాజాగా మాస్ మహారాజా సినిమాలో ఓ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న ధమాకాలో కీలకమైన చెల్లి క్యారెక్టర్ కోసం ఫరియాను లాక్ చేసినట్టు వినికిడి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తన ఎంట్రీ ఉంటుందని దానికి సంబంధించిన షూటింగ్ కొంత లేట్ కావడంతో ఆర్టిస్టుని ఫైనల్ చేయడం ఆలస్యమయ్యిందట. ఇందులోనే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలోనే వయసుపట్టింపు లేకుండా సీనియర్ హీరోకు ఎస్ చెప్పడం షాకే.
ఫరియా తాలూకు అప్ డేట్ ఇంకా అఫీషియల్ కావాల్సి ఉంది. అందంగా ఉన్నప్పటికీ ఇప్పటి కొందరు యూత్ హీరోల కన్నా పొడవుగా బొద్దుగా ఉండటం ఫరియా అవకాశాలను ప్రభావితం చేస్తోంది. ఒకవేళ ధమాకా వర్కౌట్ అయితే ఉపయోగపడొచ్చేమో కానీ ఎంతైనా సిస్టర్ క్యారెక్టర్ కాబట్టి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయడం రాంగే. ఇక రవితేజ సంగతి చూస్తే రామారావు ఆన్ డ్యూటీ ఇంకొంత బ్యాలన్స్ ఉందట. ధమాకా పూర్తవ్వగానే మాస్ మహారాజా నెక్స్ట్ రావణాసుర, వాల్తేరు వీరయ్యలతో ఈ ఏడాది మొత్తం బిజీగా గడపనున్నారు.
This post was last modified on June 4, 2022 4:09 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…