ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా కొత్త సినిమాల సందడి నడుస్తోంది. దక్షిణాది చిత్రాలైన మేజర్, విక్రమ్ పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాగా.. వీటిని మించిన ఓ పెద్ద హిందీ సినిమా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తునే విడుదలైంది. అదే.. సామ్రాట్ పృథ్వీరాజ్. మరాఠా యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ కథను అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది రూపొందించాడు. అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రూపొందించింది.
ఐతే పెద్ద కాస్టింగ్, బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచలేకపోయింది. ఎందుకోగానీ ఈ సినిమాకు హైప్ రాలేదు. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న భారీ చిత్రాలు చాలానే చూసి ఉండడం, బాహుబలి తరహాలో ఎగ్జైటింగ్ ట్రైలర్ లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తేలిపోయినట్లు కనిపించింది.
ఇక రిలీజ్ రోజు కూడా సామ్రాట్ పృథ్వీరాజ్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లాగే ఆశించిన స్థాయిలో లేదు. దీనికి తోడు సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. కొందరు సమీక్షకులేమో ఇందులోని భారీతనాన్ని, అక్షయ్ కుమార్ నటనను కొనియాడుతున్నారు. ఇది చూడాల్సిన సినిమా అని, చరిత్ర గురించి తెలుసుకోవాలని, ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతమని అంటున్నారు. కానీ ఇంకో వర్గం సమీక్షకులేమో.. ఈ సినిమా ఎంగేజింగ్‌గా లేదని, బాగా బోరింగ్ అని, చరిత్ర నేపథ్యంలో దీన్ని మించిన సినిమాలు చాలా వచ్చాయని, సీరియల్ తరహా నరేషన్‌తో దర్శకుడు విసుగెత్తించాడని విమర్శలు గుప్పిస్తున్నారు.
మొత్తంగా సినిమాకు డివైడ్ టాక్ నడుస్తుండటంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో వచ్చేలా లేవు. ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, బయ్యర్లకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అందులోనూ మేజర్, విక్రమ్ సినిమాలు మంచి టాక్ తెచ్చకోవడం దీనికి ప్రతికూలతే.
This post was last modified on June 4, 2022 8:02 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…