అదేంటో మెగా ఫ్యాన్స్ ఎంత డిస్ కనెక్ట్ చేసుకున్నా ఆచార్య తాలూకు నీలినీడలు చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఓటిటిలో వచ్చేసింది కదా ఇక దాంతో పని లేదనుకుంటే ఏదో ఒక బ్యాడ్ రికార్డు వచ్చి పడి వాళ్ళ మనసులను గాయపరుస్తోంది. సోషల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ భారీగా ప్రమోట్ చేస్తున్న ఆచార్య కేవలం రెండు వారాలకే చాలా చోట్ల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా థియేటర్ కు సంబంధించి గుర్తుపెట్టుకోకూడని రెండు మైలురాళ్లు వచ్చి చేరాయి.
ఖైదీతో స్టార్ డం వచ్చాక చిరంజీవి ఏ సినిమా అయినా సరే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మినిమమ్ 50 రోజులు ఆడేది. చివరిసారిగా లీస్ట్ రన్ వచ్చింది 1986లో రిలీజైన ధైర్యవంతుడుకి. హైదరాబాద్ వెంకటేష్ 70ఎంఎం థియేటర్లో 22 రోజులు ఆడించాక తీసేశారు. షిఫ్ట్ ఉంది కానీ కౌంట్ కాదు. ఆ తర్వాత ఇంకే మెగా మూవీకి అంత తక్కువ రన్ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆచార్య రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం కర్నూల్ జిల్లా ఆదోని సత్యం టాకీస్ లో మాత్రమే 35 రోజులు ఆడి మేజర్ వచ్చాక వెళ్లిపోయింది.
అంటే 1986 నుంచి 2022 మధ్యలో ఏ చిరంజీవి సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఇన్ని తక్కువ రోజులు ఆడలేదు. ఇదొక్కటే కాదు. కథ ఇంకా ఉంది. చిరంజీవి 50 రోజులు కూడా ఆడని మూవీ చివరిసారి వచ్చింది 1988లో రిలీజైన రుద్రవీణ. ఆ తర్వాత కొన్ని డిజాస్టర్లు వచ్చినప్పటికీ కనీసం ఏదో ఒక సింగిల్ సెంటర్లో అర్ధశతదినోత్సవం జరుపుకున్నవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆచార్య ఎక్కడా ఫిఫ్టీ డేస్ ఆడకుండా రుద్రవీణ ప్లేస్ ని తీసుకుంది. ఇలా ఒకేసారి రెండు మర్చిపోవాల్సిన రికార్డులు రావడం ఫ్యాన్స్ కి బాధేగా..
This post was last modified on June 3, 2022 6:24 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…