వాయిదాల మీద వాయిదాలు పడి, రాజమౌళి గత సినిమాల్లాగే బాగా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25న థియేటర్లలోకి దిగిన ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. వరల్డ్ వైడ్ రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. ‘బాహుబలి’ తర్వాత తనపై పెట్టుకున్న అంచనాలను రాజమౌళి నిలబెట్టుకోగలడా.. బాక్సాఫీస్ దగ్గర అలాంటి మ్యాజిక్‌ను పునరావృతం చేయగలడా అని సందేహించిన వాళ్లకు జక్కన్న గట్టిగానే సమాధానం చెప్పాడు.
డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడింది. ఐతే థియేట్రకల్ రన్ ముగిశాక కూడా ‘ఆర్ఆర్ఆర్’ ప్రకంపనలు ఆగట్లేదు. ఓటీటీల్లో కూడా ఈ చిత్రం సంచలనం రేపుతోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ రిలీజ్ చేసిన హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా అపూర్వ ఆదరణ దక్కించుకుంటోంది. ఈ మధ్య సబ్‌స్క్రిప్షన్లు తగ్గిపోయి, నెగెటివిటీని పెంచుకుంటున్న నెట్ ఫ్లిక్స్‌కు ‘ఆర్ఆర్ఆర్’ పెద్ద రిలీఫ్ ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు.
ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి ఇండియా వరకు నెట్ ఫ్లిక్స్‌లో అగ్రస్థానం ఆ చిత్రానిదే. అంతే కాదు.. 60 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ టాప్-10లో కొనసాగుతోంది. అంతేనా.. ఇన్నేళ్ల నెట్ ఫ్లిక్స్ చరిత్రలో అత్యధిక వ్యూయార్ షిప్ దక్కించుకున్న నాన్ ఇంగ్లిష్ సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు నెలకొల్పడం విశేషం. నెట్ ఫ్లిక్స్ రీచ్ ప్రకారం చూస్తే చాలా దేశాల కంటే ఇండియాలో ఆ సంస్థ బాగా వెనుకబడి ఉంది. ఇండియాలో ఈ మధ్యే దానికి ఆదరణ కాస్త పెరుగుతోంది. అలాంటిది ఓ ఇండియన్ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో నాన్-ఇంగ్లిష్ సినిమాల వ్యూయర్‌షిప్ రికార్డులన్నింటినీ దాటేసి నంబర్ వన్‌గా నిలవడం చిన్న విషయం కాదు.
అది కూడా రిలీజైన పది రోజులకే ఈ రికార్డును సాధించిందీ చిత్రం. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ వ్యూయర్‌షిప్ అవర్స్ 1.8 కోట్లను మించి ఉండడం విశేషం. ఇంత తక్కువ సమయంలో ఇన్ని గంటల పాటు ప్రదర్శితమైన నాన్ ఇంగ్లిష్ సినిమా ఏదీ లేదు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ ప్రముఖులు నెత్తిన పెట్టుకుని మోస్తున్న నేపథ్యంలో దీని రీచ్ మున్ముందు ఎక్కడికో వెళ్లబోతోందన్నది స్పష్టం.
This post was last modified on June 3, 2022 7:24 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…