రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటివలే తేజ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. ముందు నుండి ప్రచారంలో ఉన్న ‘అహింస’ టైటిలే పెట్టుకొని ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అదొచ్చి చాలా రోజులవుతుంది కానీ ఇంత వరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. షూటింగ్ స్టేజిలోనే సినిమా ఆగిపోయిందా ? అనే ప్రశ్నలు కూడా ప్రేక్షకలకు కలుగుతున్నాయి.
తేజ డైరెక్షన్ లో సినిమా అంటే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఉదయం ఏడింటికి మొదటి షాట్ పెట్టేస్తాడు. తనకున్న ఎక్స్ పీరియన్స్ తో టకటకా సీన్స్ తీసేస్తాడు. ఎక్కడా సమయం వృదా కాకుండా చూసుకుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే తేజ సినిమా అంటే డిలె ఉండదు. అందుకే అతని మేకింగ్ స్టైల్ గురించి చాలా మంది చెప్పుకుంటారు. అలాంటి తేజ సినిమా మొదటి సారి నెలలు తరబడి షూటింగ్ స్టేజిలోనే ఉండటమే ‘అహింస’ పై సందేహం కలిగిస్తుంది.
నిజానికి దగ్గుబాటి అభిరామ్ కాస్త డిఫరెంట్ అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఎప్పుడూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడని అతని చుట్టూ ఉండేవారు అంటుంటారు. అలాంటి వ్యక్తి తేజ డైరెక్షన్ లో సినిమా చేయడం అంటే కాస్త కష్టమే మరి.
తేజ నటుల నుండి డిసిప్లెన్ కోరుకుంటాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ ఏదైనా అతన్ని స్ట్రిక్ట్ చేస్తాడు. సెట్స్ లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు సహించడు. సినిమాకు సంబంధించి ఇంకా ఫైనల్ షెడ్యుల్ ఉంది. మరి ఆఖరి షెడ్యుల్ దగ్గర ఈ సినిమా ఎందుకు ఆగింది ? అభిరాం తేజని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ? వీరిద్దరికి సింక్ అవ్వలేదా ? తెలియాల్సి ఉంది.
This post was last modified on June 2, 2022 9:19 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…