దక్షిణాది దర్శకులు బాలీవుడ్ సూపర్ స్టార్లను డైరెక్టర్ చేయడం అరుదే. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ ఆ అరుదైన జాబితాలోనే చేరుతున్నాడు. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్‌ను అతను డైరెక్ట్ చేయనున్నట్లు కొన్నేళ్ల కిందటే సమాచారం బయటికి వచ్చింది. కానీ ఈ సినిమా అధికారికంగా ఇంకా మొదలే కాలేదు. అట్లీ చివరి సినిమా బిగిల్ రిలీజై మూడేళ్లు కావస్తుండగా.. అప్పట్నుంచి అతను షారుఖ్ సినిమా పని మీదే ఉన్నాడు.
కానీ ఈ చిత్రం గురించి ఇప్పటిదాకా అయితే అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. వీరి కలయికలో చిత్రానికి జవాన్ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ప్రి టీజర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారట. అది ఒకటిన్నర నిమిషం నిడివి ఉండబోతోందట.
ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో, అలాగే సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జవాన్ అనే టైటిల్ వినగానే ఇందులో హీరో సైనికుడు అయ్యుంటాడని అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం షారుఖ్ సరికొత్త అవతారంలోకి మారబోతున్నాడట. దీని గురించి కూడా క్రేజీ రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని షారుఖ్.. నాలుగేళ్ల కిందట జీరోతో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొన్నాక కెరీర్ విషయంలో బాగా ఆలోచనలో పడ్డాడు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకున్నాడు. అందులో ఒకటైన పఠాన్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవలే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో అతను డంకి అనే సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు అట్లీ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 2, 2022 10:52 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…