శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘RC15’ చిన్న చిన్న బ్రేకులతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే నలబై శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది.
సినిమాకు పనిచేస్తున్న టాప్ టెక్నీషియన్ ఒకరు బయటికి వచ్చేశారని తెలుస్తుంది. అతను మరెవరో కాదు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ అని అంటున్నారు. రామకృష్ణ సబ్బాని ‘రంగస్థలం’ తో టాప్ టెక్నీషియన్ గా గుర్తింపు అందుకున్నాడు. అందుకే శంకర్ , చరణ్ , దిల్ రాజు అతన్ని ప్రొడక్షన్ డిజైనర్ గా ఎంచుకున్నారు. ఇప్పటి వరకూ సినిమాకు భారీ సెట్స్ వేసింది రామకృష్ణనే.
తాజాగా సెట్స్ లో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆయన సినిమా నుండి బయటి కొచ్చేశాడని ,ఆయన ప్లేస్ లో తాజాగా రవీందర్ ని తీసుకున్నారని టాక్ వినబడుతుంది. రవీందర్ ఇటివలే ‘రాధే శ్యామ్’ కి వర్క్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ‘మగధీర’ కి అదిరిపోయే సెట్స్ వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా.
కొన్ని బడా సినిమాల విషయంలో ఇలా ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మరి వాటిలానే ఇది కూడా ఓ రూమరేనా ? లేదా నిజంగానే రామకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా ? తెలియాలంటే నెక్స్ట్ షెడ్యుల్ మొదలయ్యే వరకూ ఆగాల్సిందే. RC15 నెక్స్ట్ షెడ్యుల్ డిల్లీ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత యూనిట్ రాజమండ్రి, హైదరాబాద్ లో షెడ్యుల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates