‘ఆర్ఆర్ఆర్’ సినిమా థియేటర్లలో చేసిన సందడి, బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఒకెత్తయితే.. ఓటీటీల్లో రిలీజయ్యాక దాని గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ మరో ఎత్తు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల వరకు డిజిటల్‌లో జీ5 ఓటీటీ రిలీజ్ చేయగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మేరకు చాన్నాళ్ల ముందే డీల్ కుదిరింది. కాగా సౌత్ ప్రేక్షకులు ఇక్కడి భాషల్లో సినిమాను చూసి ఆస్వాదిస్తుంటే.. హిందీ వెర్షన్‌ను ఉత్తరాది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ ఓటీటీలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి కేవలం ఇండియాకు పరిమితం కాదు. హిందీ వెర్షన్ అంతర్జాతీయ స్థాయిలో అపూర్వమైన ఆదరణ దక్కించుకుంటోంది. యుఎస్ సహా వివిధ దేశాల నేటివ్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఫిదా అయిపోతున్నారు. అందులో హాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఉండడం విశేషం.ముందు హాలీవుడ్ సెలబ్రెటీలు ‘ఆర్ఆర్ఆర్’ను కొనియాడుతూ ట్వీట్లు వేస్తుంటే.. ఇదేదో పెయిడ్ పీఆర్ ప్రోగ్రాం అనిపించింది.
కానీ వాళ్లు స్వచ్ఛందంగానే సినిమాను కొనియాడుతున్నారని, అక్కడి వాళ్లకు సినిమా తెగ నచ్చేసిందని తర్వాత తర్వాత అర్థమవుతోంది. ఐదు మందో పది మందో ఇలా ట్వీట్లు వేస్తే పెయిడ్ ట్వీట్లు అనుకోవచ్చు కానీ.. వందల మంది ఇంటర్నేషనల్ సెలబ్రెటీలు స్పందిస్తున్నారంటే స్వచ్ఛందంగా చేస్తున్నట్లే. రాజమౌళి బెస్ట్ సినిమా ఏదంటే మన వాళ్లు ‘బాహుబలి’ అనే చెబుతారు. దాని ముందు ‘ఆర్ఆర్ఆర్’ చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ హాలీవుడ్ వాళ్లకు మాత్రం ‘ఆర్ఆర్ఆర్’యే తెగ నచ్చేసి జక్కన్నను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
సెలబ్రెటీలనే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి ఎగ్జైట్ అవుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి నెట్ ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్ ఇదే టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని నెట్ ఫ్లిక్స్ వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఈ మధ్య ఒక్కసారిగా సబ్‌స్క్రైబర్లు తగ్గిపోయి, ఆదరణ పడిపోయి ఇబ్బందుల్లో పడ్డ నెట్ ఫ్లిక్స్‌కు ‘ఆర్ఆర్ఆర్’ కచ్చితంగా బిగ్ రిలీఫే. దీని మీద పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్ల ప్రయోజనం పొందే ఉంటుంది ఆ సంస్థ.
This post was last modified on June 1, 2022 7:31 pm
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…