జ‌న‌గ‌ణ‌మ‌న పాడేది పూజానేనా?

గ‌త ఆరేడేళ్ల‌లో ‘ఇస్మార్ట్ శంక‌ర్’ మిన‌హా పూరి జ‌గ‌న్నాథ్‌కు స‌క్సెస్‌లు లేక‌పోయినా.. ఆయ‌న్ని న‌మ్మి లైగ‌ర్ సినిమా చేశాడు యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వీరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన ‘లైగ‌ర్’ ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నందుకుంటుందో అని విజ‌య్ అభిమానులు ఉత్కంఠ‌తో ఉండ‌గా.. అంత‌లోనే పూరితో JGM (జ‌న‌గ‌ణ‌మ‌న‌) ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు విజ‌య్.

‘లైగ‌ర్’ ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల్సింద‌న్న‌ది విజ‌య్ అభిమానుల అభిప్రాయం. ఐతే విజ‌య్ మాత్రం ఆగ‌ట్లేదు. పూరీతోనే ‘జేజీఎం’ అనౌన్స్ చేసేశాడు. కాకపోతే ఈ సినిమా ప్రకటన తర్వాత ముందుకు కదల్లేదు. మధ్యలోకి ‘ఖుషి’ని తీసుకొచ్చిన విజయ్.. దాని షూటింగ్‌లోనే పాల్గొంటున్నాడు. దీన్ని పూర్తి చేసి, ‘లైగర్’ ఫలితం చూశాక చిత్రీకరణ మొదలుపెడదామని అనుకున్నాడేమో తెలియదు.
ఐతే పూరి అండ్ కో మాత్రం ‘జేజీఎం’ ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయింది.

ఈ చిత్రంలో కథానాయికగా ముందు బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ పేరు వినిపించింది. ఆమె డేట్లు కూడా ఇచ్చేసిందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ సమాచారం నిజం కాదని తెలుస్తోంది. ‘జేజీఎం’కు పూజా హెగ్డేను కథానాయికగా అనుకుంటున్నారట. ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పడమే కాక.. త్వరలోనే ఈ చిత్రం కోసం యాక్షన్ వర్క్ షాప్‌లో కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. 

ఇందులో హీరోతో పాటు హీరోయిన్ కూడా సైనికురాలిగా కనిపించబోతోందని.. అందుకోసం పూజా ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. మొన్నటిదాకా యంగ్ హీరోయిన్లతోనే నటించిన విజయ్.. ఈ మధ్య వరుసగా సీనియర్ హీరోయిన్లతో జట్టు కడుతుండటం విశేషమే. ఆల్రెడీ ‘ఖుషి’లో సమంతతో పూర్తి స్థాయిలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు పూజా లాంటి మరో సీనియర్ హీరోయిన్‌తో రొమాన్స్ చేయబోతున్నాడు.