థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని దాదాపుగా సెలవు తీసుకున్న రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఓటిటిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ హక్కులు పొందిన నెట్ ఫ్లిక్స్ కి బంగారు బాతులా మారింది. కేవలం ఆ ఒక్క బాషతోనే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది. సబ్ టైటిల్స్ సహాయంతో చూసిన విదేశీయులు,సెలబ్రిటీల ట్వీట్లు పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
ఈ స్థాయి స్పందన సౌత్ లాంగ్వేజ్ దక్కించుకున్న జీ5కి రాకపోవడం అన్నిటిలోకి అసలు ట్విస్ట్. నెట్ ఫ్లిక్స్ అధికారికంగా విడుదల చేసిన స్టాట్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ ఇప్పుడు నాన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ విభాగంలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకుంది. 60 దేశాల టాప్ 10లో చోటు దక్కించుకుని మతిపోగొట్టే వ్యూస్ ని దక్కించుకుంటోంది.
18 మిలియన్లకు పైగా వాచ్ అవర్స్ (వీక్షించిన గంటలు) అందుకున్న ఆర్ఆర్ఆర్ డిజిటల్ ప్రయాణం మొదలై ఇంకా రెండు వారాలే అయ్యింది. రాబోయే రోజుల్లో ఇది ఎవరూ అంత సులభంగా అందుకోలేని మరిన్ని రికార్డులు నమోదు చేయడం ఖాయమని విశ్లేషకుల అంచనా.
ఇక తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళం హక్కులు పొందిన జీ5లో ఆర్ఆర్ఆర్ ఇప్పటిదాకా 100 మిలియన్ మినిట్స్ మైలురాయిని దాటేసింది ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో పోల్చుకుంటే దీని రీచ్ తక్కువైనప్పటికీ ఇక్కడా రాజమౌళి మేజిక్ గట్టిగానే పని చేసింది. ఇదంతా చూస్తున్న రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాహుబలి తరహాలో ఆర్ఆర్ఆర్ ని చైనా జపాన్ లో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే ఇండియన్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ గా ఇదే నిలుస్తుందన్న వాళ్ళ నమ్మకం నిజమే.
This post was last modified on June 1, 2022 1:29 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…