Movie News

ఎఫ్-3.. అక్కడ సర్‌ప్రైజ్ హిట్

గత వారాంతంలో విడుదలైన ఎఫ్-3 సినిమాను మెచ్చిన వాళ్లున్నారు. అదే సమయంలో ఆ సినిమాను తీవ్రంగా విమర్శించిన వాళ్లూ ఉన్నారు. కానీ డివైడ్ టాక్‌ను తట్టుకుని ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది. వారాంతంలో రూ.30 కోట్లకు పైగానే షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా స్థాయిలో ఇవి చాలా మెరుగైన వసూళ్లే. ‘ఎఫ్-2’ బ్రాండ్ ఈ సినిమాకు బాగా పని చేసినట్లు అర్థమవుతోంది. చాన్నాళ్లుగా సరైన ఫ్యామిలీ సినిమా లేకపోవడంతో ఆ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున తరలిరావడం ‘ఎఫ్-3’కి కలిసొచ్చింది.

ఐతే ‘ఎఫ్-3’ తరహా స్లాప్ స్టిక్ కామెడీలు మామూలుగా యుఎస్‌లో అంత బాగా ఆడవు. అక్కడి ప్రేక్షకులు క్లాస్ టచ్ ఉన్న వినోదాత్మక చిత్రాలకు పట్టం పడుతుంటారు. ‘ఎఫ్-2’ అక్కడ బాగానే ఆడినప్పటికీ.. దానికి పోటీగా సంక్రాంతి టైంలో వచ్చిన సినిమాలు పూర్తిగా ఫెయిలవడం కలిసొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుకే ఆ చిత్రం పెద్ద హిట్టయింది. కానీ కొవిడ్ తర్వాత బాక్సాఫీస్ పరిస్థితులు పూర్తిగా మారిపోయి.. ఇక్కడి వాళ్లే కాక యుఎస్ ప్రేక్షకులు కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చూస్తున్నారు. అక్కడ అన్ని సినిమాలకూ ఓపెనింగ్స్ వచ్చేయట్లేదు.

‘ఎఫ్-3’కి అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్‌లో ఆశించిన స్థాయిలో ఏమీ కనిపించలేదు. ప్రిమియర్లతో ఈ చిత్రం 2.5 లక్షల డాలర్లే వసూలు చేసింది. ఇది అక్కడ స్లో స్టార్ట్ అన్నట్లే. దీనికి తోడు టాక్ మరీ గొప్పగా ఏమీ లేకపోవడంతో ‘ఎఫ్-3’ ఫుల్ రన్లో మిలియన్ మార్కును దాటడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా అక్కడ అదరగొడుతోంది.

వీకెండ్ అయ్యేసరికే మిలియన్ మార్కుకు చేరువ అయిన ఈ చిత్రం.. సోమవారం సెలవు కలిసి రావడంతో మ్యాజిక్ మార్కును దాటేసింది. ఇలాంటి స్లాప్ స్టిక్ కామెడీ మూవీ అక్కడ ఇంత వేగంగా మిలియన్ మార్కును అందుకోవడం విశేషమే. మంగళవారం ఆఫర్లుంటాయి కాబట్టి.. ఈ రోజు కూడా సినిమాకు చెప్పుకోదగ్గ వసూళ్లే రావచ్చు. బుధవారం నుంచి సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నదే చూడాలి.

This post was last modified on May 31, 2022 7:40 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

25 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago