చాన్నాళ్ళుగా వాయిదా పడుతూ థియేటర్స్ ఆ ? ఓటీటీ ఆ ? అనే సందిగ్దం లో ఉన్న రానా ‘విరాట పర్వం’ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుంది. ఇటివలే జులై 1న రిలీజ్ అంటూ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. కానీ ఉన్నపళంగా ఇప్పుడు ఆ డేట్ మార్చుకొని ఇంకాస్త ముందుకొచ్చారు. జులై 1న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మేరకు అధికారికంగా ప్రకటన ఇచ్చారు. నిజానికి ఆ డేట్ రవితేజ సినిమాది. జూన్ 17 ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ అవ్వాలి. కానీ ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ‘విరాట పర్వం’ ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సురేష్ బాబు రవితేజ స్లాట్ లో రానా సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇక జూన్ 10 న నాని ‘అంటే సుందరానికీ’ సినిమాతో పాటు కన్నడ డబ్బింగ్ సినిమా ‘777 చార్లీ’ రిలీజ్ అవ్వబోతుంది. ఇక రక్షిత్ శెట్టి సినిమా వల్ల తెలుగులో రానా సినిమాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ నాని సినిమా ఏమాత్రం బాగున్నా ఆ తర్వాతి వారంలో రిలీజయ్యే ‘విరాటపర్వం’ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది.
జూన్ లో స్లాట్ దొరకడంతో సురేష్ బాబు అన్ని విధాల ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. సినిమాలో సాయి పల్లవి కోలో సాంగ్ హిట్ నంబర్ అనిపించుకుంది. టీజర్ , ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. మరి రానా ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
This post was last modified on May 30, 2022 9:31 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…