ఒక్కో యాప్ కి ఏడాదికి సరిపడా చందా కట్టేశాం, ఇంకేముంది మూడు వందల అరవై అయిదు రోజులు ఓటిటిలో కంటెంట్ మొత్తం హ్యాపీగా చూసుకోవచ్చనే భ్రమలకు డిజిటల్ సంస్థలు మెల్లగా చెల్లుచీటీ పాడేస్తున్నాయి. ఇటీవలే కెజిఎఫ్ 2 విషయంలో అమెజాన్ ప్రైమ్ అనుసరించిన పే పర్ వ్యూ మోడల్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో సోషల్ మీడియా వేదికగా గమనించాం.
దెబ్బకు ఆర్ఆర్ఆర్ ని ఇదే తరహాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న జీ5 వెనుకడుగు వేసి సబ్స్క్రైబర్స్ అందరికీ ఫ్రీ యాక్సిస్ ప్రకటించేసింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇకపై పాత సినిమాలకు సైతం డబ్బులు కట్టించుకుని సినిమాలు చూసేలా సదరు డిజిటల్ సంస్థలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఓ ఉదాహరణ చూద్దాం.
వచ్చే నెల జూన్ 9న జురాసిక్ వరల్డ్ డొమినియన్ థియేటర్లలో విడుదల కాబోతోంది. సరే ఓసారి 1996 నుంచి వచ్చిన పాత భాగాలను ఓ రౌండ్ వేద్దామని ప్రైమ్ కు వెళ్ళారనుకోండి ఒకొక్కటి 99 రూపాయలు అద్దె చెల్లించి మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటలలోపే చూసేయడం పూర్తి చేయాలి. లేదంటే అంతే సంగతులు.
ఇవాళ భారీ ఎత్తున రిలీజైన టాప్ గన్ మావరిక్ ఒకప్పటి 1986 వెర్షన్ ని చూడాలంటే ఇదే ప్రైమ్ లో 75 రూపాయలు సమర్పించుకోవాలి. ఇవన్నీ మొన్నటి దాకా ఫ్రీగా అందుబాటులో ఉన్నవే. అంటే మనం కట్టిన పదిహేను వందలు కాకుండా ఇవన్నీ ఎక్స్ ట్రా అన్నమాట. ఓటిటి కంటెంట్ కి మనోళ్లు బాగా అలవాటు పడ్డాక ఇప్పుడా కంపెనీలు అసలు రంగులు బయటపెడుతున్నాయి. అసలే థియేటర్లో టికెట్ రేట్ల మోతతో ఇంట్లోనే కూర్చుకుని ఎంజాయ్ చేద్దామంటే ఇదో ఇలాంటి షాకులతో వినోదాన్ని ఖరీదుగా మార్చేస్తున్నారు.
This post was last modified on May 28, 2022 10:47 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…