తొలి సినిమాతో ఎంత పెద్ద విజయం అందుకున్నా.. ఆ తర్వాత కూడా వరుసగా మరి కొన్ని హిట్లు ఇచ్చినా.. ఎల్లకాలం విజయాలతోనే సాగడం మాత్రం దాదాపు అసాధ్యమే. బడా బడా దర్శకులు కూడా కెరీర్లో కాస్త ముందుకెళ్లాక ఫ్లాపులు ఎదుర్కొన్న వారే. టాలీవుడ్లో ఒక్క రాజమౌళి మాత్రమే అపజయమే లేకుండా సాగిపోతున్నాడు. ఆయన కెరీర్లో ఒక్క ‘సై’ మాత్రమే పెద్ద హిట్ కాలేదు. కానీ అది కూడా ఫ్లాప్ అని అనలేం. ఉన్నంతలో బాగానే ఆడింది.
బ్రేక్ ఈవెన్ అయి హిట్ స్టేటస్ అందుకుంది. రాజమౌళికి ముందు, తర్వాత ఇలా సుదీర్ఘ కెరీర్లో అపజయాలు లేకుండా సాగలేకపోయారు. కొరటాల శివ వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు ఇచ్చి రాజమౌళి బాటలో సాగుతున్నట్లు కనిపించాడు కానీ.. ఆయన ట్రాక్ రికార్డును ‘ఆచార్య’ దారుణంగా దెబ్బ తీసింది. అది మెగా డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అనిల్ రావిపూడి మీద నిలిచాయి.
‘పటాస్’తో మొదలుపెట్టి.. సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్-2 సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో అనిల్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు ‘ఎఫ్-3’ సినిమాతో అతను డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాడా లేదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేకపోవడం, ‘ఎఫ్-3’ మీద బ్రేక్ ఈవెన్ భారం చాలా పెద్దదిగా ఉండడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ‘ఎఫ్-3’లో లాజిక్‌లు లేకపోయినా కామెడీతో అని మ్యాజిక్ చేయడంతో సినిమాకు శుభారంభం దక్కింది. రివ్యూలు, మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉంది. అలాగే సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండబోతున్నట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సినిమాకు అన్నీ మంచి శకునాలే అన్నట్లుగా ఉంది. కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ‘ఎఫ్-3’ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడడం, అనిల్ డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసి.. రాజమౌళి తర్వాత ఈ ఘనత సాధించిన దర్శకుడిగా ఘనత వహించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on May 28, 2022 11:17 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…