Movie News

విరాట‌ప‌ర్వం డేట్ మ‌ళ్లీ మారింది.. ట్విస్టేంటంటే?

రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర పోషించిన‌ విరాట‌ప‌ర్వం సినిమా విడుద‌ల ఇప్ప‌టికే చాలా ఆల‌స్యమైంది. భీమ్లానాయ‌క్ కంటే ముందు రానా ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. కానీ కొవిడ్ స‌హా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ చిత్రం విడుద‌ల‌కు నోచుకోలేదు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్‌ను ప‌లుమార్లు మార్చారు. కొన్ని నెల‌ల పాటు అస‌లు సినిమా వార్త‌ల్లోనే లేకుండాపోయింది. ఒక ద‌శ‌లో ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసేస్తున్న‌ట్లు కూడా ప్ర‌చారం సాగింది.

కానీ ఈ ప్ర‌చారానికి తెర‌దించుతూ ఇటీవ‌లే థియేట్రిక‌ల్‌ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. జులై 1న విరాట‌ప‌ర్వంను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కానీ ఆ డేట్‌కు సినిమా రావ‌ట్లేదు. మ‌రోసారి ఈ చిత్ర విడుద‌ల తేదీ మారింది. అలాగ‌ని మ‌ళ్లీ వాయిదా అనుకుంటే పొర‌బాటే. ఈ సినిమాను అనుకున్న‌దానికంటే ముందే విడుద‌ల చేయ‌బోతున్నారు. జూన్ 17న ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోంది.

జులై 1న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్, రంగ‌ర రంగ వైభ‌వంగా చిత్రాలు కూడా విడుద‌ల‌వుతుండ‌గా.. .జూన్ 17న రావాల్సిన పెద్ద సినిమా రామారావు-ఆన్ డ్యూటీ వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఖాళీగా ఉన్న వీకెండ్‌ను వాడుకోవ‌డానికి విరాట‌ప‌ర్వం టీం రెడీ అయింది. సినిమా ఫ‌స్ట్ కాపీతో ఎప్పుడో రెడీ అయిపోయింది కాబ‌ట్టి.. రిలీజ్ డేట్ ప్రిపోన్ చేయ‌డానికి ఇబ్బంది లేక‌పోయింది.

ఇందుకు త‌గ్గ‌ట్లుగా ప్రమోష‌న్లు కూడా ప్లాన్ చేయ‌బోతున్నారు. వాయిదాల మీద వాయిదాలు ప‌డ‌టం వ‌ల్ల ఈ సినిమాకు గ‌తంలో ఉన్నంత బ‌జ్ లేదు. కాబ‌ట్టి విడుద‌ల‌కు ముందు కొంచెం గ‌ట్టిగానే ప్ర‌మోష‌న్లు చేసి సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. రానా స‌రస‌న సాయిప‌ల్ల‌వి న‌టించిన ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర పోషించింది. నీదీ నాదీ ఒకే క‌థ ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌ న‌క్స‌లిజం నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందించాడు.

This post was last modified on May 28, 2022 10:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago