Movie News

ఇలా వెంకీ మాత్రమే చేయగలడు

దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ను ఏలిన నలుగురు నిన్నటి తరం టాప్ స్టార్లలో విక్టరీ వెంకటేష్ ఒకడు. బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా లాంటి చిత్రాలతో రికార్డులు తిరగరాసిన ఘన చరిత్ర వెంకీ సొంతం. ఓవైపు కుటుంబ కథా చిత్రాలతో అలరిస్తూనే.. ఇంకోవైపు మాస్, యాక్షన్ చిత్రాలతో మెప్పించడం వెంకీకే చెల్లింది.

ఐతే కెరీర్లో ఒక దశ దాటాక వెంకీ ఫ్యామిలీ, కామెడీ చిత్రాలే ఎక్కువగా చేశాడు. అందుక్కారణం.. వెంకీకి కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్. వాళ్లు ఆయన్నుంచి ఆశించేది కూడా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్లే. ఐతే ఈ జానర్ సినిమలు చేసేటపుడు వెంకీ ఇమేజ్ గురించి, తన మాస్, యూత్ ఫ్యాన్స్ గురించి ఏమాత్రం ఆలోచించడు. ఇమేజ్ ఛట్రం నుంచి పూర్తిగా బయటికి వచ్చి ఒక కమెడియన్ లాగా నవ్వించడానికి ప్రయత్నిస్తాడు.

ఈ క్రమంలో తన మీద తాను జోకులు వేసుకోవడానికి వెనుకాడడు. పాత్రకు తగ్గట్లు ఎంత తగ్గి నటించడానికైనా కూడా సిద్ధంగా ఉంటాడు.కాబట్టే కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో కూడా ‘పెళ్ళి కాని ప్రసాద్’ పాత్రలో నటించి మెప్పించగలిగాడు. ఇక కొన్నేళ్ల కిందట ‘ఎఫ్-2’లో భార్యా బాధితుడిగా వెంకీ చేసిన విన్యాసాలు, పండించిన కామెడీని అంత సులువుగా మరిచిపోలేం. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ఎఫ్-3’లోనూ వెంకీ అతి సామాన్యమైన, అందులోనూ వైకల్యం ఉన్న పాత్ర చేసి మెప్పించాడు. ఇందులో వెంకీ రేచీకటి ఉన్న వ్యక్తిగా నటించడం విశేషం. ఒకప్పుడు బ్రహ్మానందం లాంటి కమెడియన్లు చేసిన క్యారెక్టర్ ఇది. సీనియర్లు కావచ్చు, యంగ్ హీరోలు కావచ్చు. కాస్త ఇమేజ్ ఉన్న హీరోలెవరైనా సరే.. ఇలాంటి పాత్ర చేయాలంటే కాస్త ఆలోచిస్తారు.

కానీ వెంకీ మాత్రం ఎలాంటి శషభిషలు లేకుండా ఆ పాత్రను చేశాడు. రేచీకటి చుట్టూ నడిపిన కామెడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి దీని చుట్టూ ఇంకా కామెడీ పండించే అవకాశం ఉన్నా కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఆ ప్రయత్నం చేయలేదు. కంటెంట్ పరంగా వీక్ అయినా సరే.. ‘ఎఫ్-3’ పైసా వసూల్ ఎంటర్టైనర్ అనిపించుకుంటోందంటే అందుక్కారణం కచ్చితంగా వెంకీనే. సినిమాలో మిగతా అంశాలు ఎలా ఉన్నా.. వెంకీ పాత్రతో కనెక్ట్ అయితే చాలు సంతృప్తిగా థియేటర్ నుంచి రావచ్చు. కాబట్టి ‘ఎఫ్-2’ మాదిరే ‘ఎఫ్-3’ సక్సెస్ క్రెడిట్లో మేజర్ షేర్ వెంకీకే చెందుతుంది.

This post was last modified on May 28, 2022 2:03 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

4 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

5 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

6 hours ago