టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అప్ కమింగ్ సినిమా ఎఫ్ ౩ మే 27న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం భారీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయా చానెల్స్ కి మంచి కంటెంట్ ఇస్తున్నాడు అనిల్. అందులో భాగంగా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా చెప్పుకున్నాడు.
ఎప్పకైనా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సోషియో ఫాంటసీ సినిమా చేయాలనుందని అది తన డ్రీం అని అన్నాడు. ‘మాయాబజార్’ లాంటి ఫ్యామిలీ సినిమా తీసి ఎమోషన్స్ తో మెప్పించాలనేది అనీల్ కున్న ఇంకో డ్రీం కూడా. దర్శకుడిగా చిరంజీవి ,బాలయ్య , వెంకటేష్ , నాగార్జున లతో సినిమాలు చేయాలనుకున్నాను. అందులో వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను.
ఇప్పుడు బాలయ్య గారితో చేయబోతున్నాను. ఇక చిరు , నాగ్ ఇద్దరే మిగిలారు. వాళ్ళని కూడా డైరెక్ట్ చేస్తే దర్శకుడిగా నా ఆశయం నెరవేరుతుందని చెప్తున్నాడు. మరి చిరు , నాగ్ అనీల్ కి ఎప్పుడు అవకాశం ఇస్తారో చూడాలి.
ఇక తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో మెప్పిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ బాలయ్యని తన సినిమాలో సరికొత్తగా, ఇప్పటి వరకూ ఎవరూ చూడని కోణంలో చూపిస్తానని ఘంటాపదంగా
ఎఫ్ ౩ ప్రమోషన్స్ లో బాలయ్య సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ చెప్పేసి ఇప్పటి నుండే బాలయ్య ఫ్యాన్స్ ని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్. మరి బాలయ్య ని అనిల్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో ఎలాంటి సినిమా రూపొందిస్తాడో చూడాలి.
This post was last modified on May 27, 2022 5:05 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…