అసలింకా షూటింగే మొదలు కానీ సినిమాల గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని ఆర్ఆర్ఆర్ విజయం కొంతే తీర్చిందని ఫీలవుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోలో హీరోగా తను చేయబోయే ప్రాజెక్టుల మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. కొరటాల శివ కన్నా ఎక్కువ వాళ్ళ ఫోకస్ ప్రశాంత్ నీల్ మీద ఉంది. కెజిఎఫ్, సలార్ తర్వాత చేయబోయేది తమ హీరోతోనే కాబట్టి ఎలివేషన్లు ఏ స్థాయిలో ఉంటాయోనని ఊహించుకుంటున్నారు.
ప్రభాస్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తారక్ తాలూకు పనులు కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా నెగటివ్ లీడ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే లోక నాయకుడు కమల్ హాసన్ ని సంప్రదించినట్టు ఫిలిం నగర్ టాక్. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కమల్ కు కొత్తేమి కాదు. అభయ్ లో చేసిన సైకో విలనిజం ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. కెరీర్ తొలిదశలో చేసిన ఎర్రగులాబీలు చరిత్రలో నిలిచిపోయే ఎవర్ గ్రీన్ పెర్ఫార్మన్స్. దశావతారంలోనూ చెలరేగిపోవడం గుర్తుందిగా.
సో కథ నచ్చాలే కానీ కమల్ హాసన్ ఇమేజ్ గట్రా పట్టించుకోరు. కాకపోతే పైన చెప్పిన ఉదాహరణలన్నీ ఆయన హీరోగా నటించినవి. మరి తారక్ మూవీలో అంటే ఒప్పుకుంటారా అనేది చూడాలి. అయినా ప్రశాంత్ నీల్ అంత గుడ్డిగా డిజైన్ చేయరు. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళను హర్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుంటారు. మరి ఇదెంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి. జూన్ 3న విడుదల కాబోయే విక్రమ్ పనుల్లో బిజీగా ఉన్న కమల్ ఆ తర్వాత శంకర్ అందుబాటుని బట్టి ఇండియన్ 2 రీ స్టార్ట్ చేయాల్సి ఉంది.
This post was last modified on May 25, 2022 12:28 pm
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…