సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగా ఉండిపోవాలని అనుకోవట్లేదు. తన బ్రాండ్ వాల్యూను ఉపయోగించుకుని ఇబ్బడిముబ్బడిగా యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న మహేష్.. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా నిర్మాతగానూ మారాడు. తన సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడితో సరిపెట్టకుండా వేరే హీరోల్ని పెట్టి సినిమాలను నిర్మించే పని కూడా మొదులపెట్టాడు.
క్షణం, గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్లతో మంచి స్థాయిని అందుకున్న అడివి శేష్‌ను పెట్టి ‘మేజర్’ అనే సినిమాను మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2008 ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
దీని తర్వాత మహేష్ మరో యువ కథానాయకుడితో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. శర్వానంద్. లాక్ డౌన్ టైంలో మహేష్ చాలా కథలు వినగా.. అందులో ఒక మీడియం రేంజ్ సినిమా తీయగల కథ మహేష్‌కు బాగా నచ్చిందని.. ఆ కథకు శర్వానంద్ అయితే బాగుంటుందని మహేష్ ఫీలయ్యాడని సన్నిహిత వర్గాల సమాచారం.
శర్వాను అడిగారా.. అతను ఓక అన్నాడా లేదా అనే విషయాలపై స్పష్టత లేదు. మహేష్ అడిగితే అతను కాదనే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ సినిమా ఓకే అయ్యే అవకాశమే ఉందని అంటున్నారు. మళ్లీ షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యే సమయానికి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక శర్వా విషయానికి వస్తే.. గత కొన్నేళ్లలో సరైన సినిమా పడక అతను కొంచెం వెనుకబడి ఉన్నాడు. అతడి కొత్త చిత్రం ‘శ్రీకారం’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on June 26, 2020 10:01 am
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…