విక్టరీ వెంకటేష్ మరో మూడు రోజుల్లో ‘ఎఫ్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు వెంకీ. తన అప్ కమింగ్ మూవీస్ గురించి ఎన్నడూ క్లారిటీ ఇవ్వని వెంకీ ఈసారి ఓపెన్ అయ్యాడు. రానా తో కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ షూట్ కంప్లీట్ చేశానని చెప్పాడు. అందులో తన లుక్ కేరెక్టర్ కొత్తగా ఉంటుందని, త్వరలోనే లుక్ రివీల్ అవ్వనుందని తెలిపాడు. ఇక సల్మాన్ ఖాన్ తో ఓ హిందీ సినిమా చేయబోతున్నానని వచ్చే నెలలో ఆ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతానని అన్నాడు.
అలాగే నెక్స్ట్ సితార ఎంటర్టైన్ మెంట్ , మైత్రి మూవీ మేకర్స్ బేనర్స్ లో సినిమాలు చేయబోతున్నానని చెప్పుకున్నాడు. కాకపోతే ఆ సినిమాలకు ఇంకా డైరెక్టర్స్ ఫిక్స్ అవ్వలేదని ఇంకా వాళ్ళు కథలు చూస్తున్నారని అన్ని కుదిరినప్పుడు ఆ సినిమాలు చేస్తానని తెలిపాడు. ఇక త్రివిక్రమ్ తో సినిమా సంగతేంటి ? అని అడగ్గా ప్రస్తుతం తను బిజీగా ఉన్నాడని ఎప్పుడు ఉంటుందో తెలియదని సమాదానమిచ్చాడు వెంకీ.
ఇక ‘ఎఫ్ 3’ ఏ రేంజ్ హిట్ అవుతుంది ? నంబర్స్ గేమ్ పట్టించుకుంటారా ? అనే ప్రశ్నలకు కూడా ఆన్సర్ ఇచ్చాడు. నా సినిమాలకు సంబంధించి ఈ రేంజ్ హిట్, ఆ రేంజ్ హిట్ అని ఎప్పుడూ చెప్పనని అది అలవాటు లేని పని అన్నాడు. నంబర్స్ పట్టించుకోను కానీ నిర్మాత పెట్టిన డబ్బుకి లాభం వచ్చిందా లేదా అనేది మాత్రం చూస్తానని ఎక్కడైనా వేస్టేజ్ జరిగితే మాత్రం ఒక నిర్మాత కొడుకుగా కాస్త భాద పడతానని చెప్పాడు. ఎఫ్ 3 ప్రమోషన్స్ లో యంగ్ హీరోతో పోటీ పడుతో చురుగ్గా పాల్గొంటూ సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తున్నాడు వెంకీ. మరి ఈ ఫ్రాంచైజీతో వెంకీ మరో విక్టరి అందుకుంటాడా లేదా చూడాలి.
This post was last modified on May 25, 2022 11:28 am
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…