వచ్చే జూన్ 3 విడుదల కాబోతున్న పృథ్విరాజ్ మీద చెప్పుకునే హైప్ ఏర్పడకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. యష్ రాజ్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీని హిందీతో పాటు తెలుగు తమిళం మలయాళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టినప్పుడు దాని గురించి సగటు మూవీ లవర్స్ మాట్లాడుకునేలా ప్రమోషన్ చేయాలి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ జరగాలి. అసలాంటిదేమీ లేదు. చేతిలో పది రోజులే ఉందన్న ధ్యాస లేకుండా ఉంది టీమ్.
స్టార్ హీరో ఉన్నా ఇలా జరగడం ఆశ్చర్యం కలిగించేదే. విశ్లేషకుల కోణం నుంచి చూస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అక్షయ్ కుమార్ అంత పవర్ ఫుల్ పృథ్విరాజ్ క్యారెక్టర్ కి సరితూగలేదని సాధారణ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ క్వాలిటీ కంటెంట్ చూసుకోకుండా వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్న అక్షయ్ కుమార్ ఈ మధ్య గట్టి దెబ్బలే తింటున్నాడు. ఒక్క సూర్యవంశీ మినహాయిస్తే బెల్ బాటమ్, బచ్చన్ పాండే కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోలేని డిజాస్టర్స్ అయ్యాయి.
ఇలా చూసుకుంటే మేజర్ టీమ్ వేసిన ఎత్తుగడ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మెయిన్ రిలీజ్ కు తొమ్మిది రోజుల ముందు మొదలుపెట్టిన ప్రీ రిలీజ్ ప్రీమియర్స్ కు పూణే, అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో అద్భుతమైన స్పందన దక్కుతోంది టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. సెన్సార్ సభ్యుల ప్రశంసలను టీమ్ ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు కమల్ హాసన్ విక్రమ్ బృందం పబ్లిసిటీ వేగం పెంచింది. మరి ఇంత ఒత్తిడి మధ్య పృథ్విరాజ్ నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on May 25, 2022 11:24 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…