కెరీర్ మంచి ఊపులో ఉండగానే హీరోయిన్లు రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం తక్కువ. ఒకవేళ వెళ్లినా.. దాన్ని బహిరంగ పరచడానికి ఇష్టపడరు. దాని వల్ల కెరీర్‌కు నష్టమే అని భావిస్తారు చాలామంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, ఇంకా చాలా కెరీర్ ఉండగానే ఆమె ప్రేమ బంధంలోకి వెళ్లింది.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ఆమె గత ఏడాది ప్రేమలో పడటం తెలిసిందే. అంతే కాక దాని గురించి అందరికీ ఓపెన్‌గానే చెప్పేసింది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది రకుల్.
జాకీ, నేను ముందు మంచి స్నేహితులయ్యాం. మా అభిరుచులు కలవడంతో ప్రేమికులుగా మారాం. రిలేషన్‌షిప్ ఓకే అయినపుడే.. ఈ బంధం గురించి దాచి పెట్టొద్దని, సాధ్యమైనంత త్వరగా దీని గురించి అందరికీ చెప్పేయాలని ఫిక్సయ్యాం. మా బంధం గురించి బయటికి చెప్పకుంటే.. జరిగే అసత్య ప్రచారాలు, వచ్చే ఊహాగానాలను తట్టుకోవడం కష్టం. ప్రశాంతత ఉండదు. మా వ్యక్తిగత జీవితం కంటే మా పని గురించి అందరూ మాట్లాడుకోవాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలాగే ప్రేమ బంధంలో ఉండటం కూడా సహజం. మన జీవితాల్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు ఎలా ఉంటారో.. మన జీవిత భాగస్వామిగానూ ఒక వ్యక్తి ఉంటారు.
సెలబ్రెటీలు కావడం వల్ల అందరూ మా వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టిపెడతారు. అది మాకిష్టం లేదు. అందుకే మా గురించి అందరికీ ఓపెన్‌గా చెప్పేశాం అని రకుల్ తెలిపింది. మరి జాకీతో ఎప్పుడు వివాహ బంధంలోకి వెళ్లబోయేది రకుల్ ఇంకా వెల్లడించలేదు. చివరగా రకుల్ తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. హిందీలో ఇటీవలే రన్ వే 34 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఐతే ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు.
This post was last modified on May 24, 2022 9:14 am
సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి…
తమిళ స్టార్ హీరో విశాల్.. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కర కాలం కిందట విడుదల…
మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఏప్రిల్ 25 విడుదల నిర్ణయంలో ఎలాంటి మార్పు…
రౌడీ బాయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ 12 విడుదల తేదీని మే 30కి లాక్ చేసినట్టు…
ఒక రీమేక్ ఎంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శకులకు పెద్ద సవాల్ గా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ ని సబ్ టైటిల్స్…
గడచిన రెండు, మూడు రోజులుగా ఏపీలో ఒకటే రచ్చ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్…