యూట్యూబ్‌లోకి వెళ్లి త్రివిక్రమ్ స్పీచ్ అని కొట్టగానే.. మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్న స్పీచ్‌లు వరుసగా ప్రత్యక్షమవుతాయి. అందులో టాప్‌లో కనిపించేవి మా టీవీ అవార్డుల వేడుకలో సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ తాలూకు వీడియోలే. సీతారామశాస్త్రి మీద తనకున్న అభిమానాన్నంతా చూపిస్తూ.. తన సాహిత్యాభిరుచిని, భాషమీద పట్టును చాటుకుంటూ మాటల మాంత్రికుడు చేసిన ఆరు నిమిషాల ప్రసంగం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాతి కాలంలో అది కల్ట్ స్పీచ్‌గా మారిపోయింది.
ఆ ఆరు నిమిషాల్లో త్రివిక్రమ్ మాట్లాడిన కొన్ని మాటలు అలాగే జనాల గుండెల్లో ముద్ర వేసుకున్నాయి. అక్కడ స్పేస్ లేదు, కానీ ఆయన తీసుకున్నారు.. లాంటి మాటలు మీమ్స్‌కు కంటెంట్‌గా మారిపోవడం విశేషం. ఐతే త్రివిక్రమ్ ఎప్పుడు వేదిక ఎక్కినా గొప్పగానే మాట్లాడుతుంటాడు కానీ.. మళ్లీ ఆ స్థాయి స్పీచ్ మాత్రం ఇవ్వలేదు.
కాగా మరోసారి సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూనే ఆ స్థాయి స్పీచ్‌ను డెలివర్ చేశారు త్రివిక్రమ్. తాజాగా సీతారామశాస్త్రి జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో త్రివిక్రమ్ ఆయనపై తనకున్న అభిమానాన్ని, భక్తిని, ప్రేమను మరోసారి చాటి చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ స్పీచ్.. లేటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీతారామశాస్త్రితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. పాట కోసం ఆయన పడే తపనను, అర్ధరాత్రి వేళ ఒక మంచి లైన్ రాస్తే దాని గురించి తనకు ఫోన్ చెబుతూ ఎగ్జైట్ అయ్యే తీరును.. ఇలా చాలా విషయాలను అద్భుతంగా చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. సీతారామశాస్త్రితో తనకు రకరకాల విషయాల్లో వాదనలు జరిగేవని.. ఇద్దరూ గట్టిగా మాట్లాడుకునేవాళ్లమని.. ఐతే తన లాంటి వాడికి వాదించే అవకాశం ఇవ్వడం ఆయన గొప్పదనమని త్రివిక్రమ్ అన్నాడు.
సీతారామశాస్త్రి లేకున్నా.. ఆయన పదాలు తిరుగాడుతూనే ఉంటాయని, మన మీద ఎప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంటాయని ఆయన పేర్కొన్నాడు. త్రివిక్రమ్ స్పీచ్‌ను మాటల్లో రాయడం కంటే.. వీడియో రూపంలో చూస్తే దాని ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. సీతారామశాస్త్రి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసేలా ఉన్న ఈ స్పీచ్ కూడా కాలక్రమంలో ఇది కూడా ఒక కల్ట్ స్టేటస్ తెచ్చుకునే అవకాశాలున్నాయి.
This post was last modified on May 22, 2022 7:45 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…