Movie News

అలాంటి హీరో వెంకీ ఒక్క‌రే-అనిల్ రావిపూడి


టాలీవుడ్ టాప్ స్టార్ల‌లో కామెడీ బాగా ఎవ‌రు చేస్తారు అంటే.. ఎక్కువ మంది నుంచి వ‌చ్చే స‌మాధానం విక్ట‌రీ వెంక‌టేష్‌దే. ఇండ‌స్ట్రీ హిట్లు కొట్టిన ఘ‌న చ‌రిత్ర ఉన్న వెంకీ.. కామెడీ ట‌చ్ ఉన్న సినిమాల్లో ఒక మామూలు న‌టుడిలా మారిపోయి అద్భుతంగా కామెడీ పండిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఎఫ్‌-3 ప్రి రిలీజ్ ఈవెంట్లో వెంకీపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. వెంకీ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మంటూ ఐల‌వ్యూ చెప్పిన అనిల్.. ఈ సీనియ‌ర్ న‌టుడి ప్ర‌త్యేక‌త‌ను గుర్తు చేశాడు.

వెంక‌టేష్‌ ఎంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ.. ఒక కామెడీ సీన్ చేయాల్సి వ‌స్తే ఇమేజ్ పూర్తిగా ప‌క్క‌న పెట్టి ఒక చిన్న పిల్లాడిలాగా ఆ స‌న్నివేశాన్ని చేసి అంద‌రినీ న‌వ్విస్తార‌ని.. ఇలా చేయ‌గ‌ల స్టార్ హీరో ఆయ‌నొక్క‌రే అని, ఇంకెవ‌రూ చేయ‌లేర‌ని అనిల్ తేల్చేశాడు. ఎఫ్‌-3 చాలా ఎక్కువ‌మంది ఆర్టిస్టుల‌తో చేసిన సినిమా అని.. రోజూ షూటింగ్‌లో 30 మంది ఆర్టిస్టులుంటే.. ఒక‌రు ముందు, ఒక‌రు వెనుక వ‌స్తుంటార‌ని.. ఐతే సెట్లో ఏ డిస్ట‌బెన్స్ లేకుండా అంద‌రినీ కూల్ చేసి ఎంట‌ర్టైన్ చేసే బాధ్య‌త‌ను వెంకీ తీసుకునేవార‌ని అనిల్ చెప్పాడు.

ఎఫ్‌-3 సినిమాకు ఎఫ్‌-2నే పెద్ద శ‌త్రువు అని, ఆ సినిమాను అంత బాగా ఆద‌రించిన నేప‌థ్యంలో దాన్ని మించి త‌ర్వాతి సినిమా ఉండాల‌న్న ఉద్దేశంతో ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశామ‌ని.. కొవిడ్‌లో మూడు ద‌శ‌లు దాటుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేశామ‌ని అనిల్ తెలిపాడు. ఈ రెండేళ్లు క‌రోనా వ‌ల్ల‌ జ‌నం ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని.. చాలా దాటుకుని వ‌చ్చార‌ని.. వాళ్లంద‌రూ కూడా ఈ నెల 27న థియేట‌ర్ల‌లో ఎఫ్‌-3ని చూస్తే ఫుల్ రిలాక్స్ అవుతార‌ని.. న‌వ్వించ‌డం త‌ప్ప ఈ సినిమా ఉద్దేశం ఇంకేమీ కాద‌ని.. ఇందులో లాజిక్కులు ఉండ‌వ‌ని, న‌వ్వులు మాత్ర‌మే ఉంటాయ‌ని అనిల్ స్ప‌ష్టం చేశాడు.

This post was last modified on May 22, 2022 7:36 am

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

16 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago