Movie News

రాజమౌళి తారక్ బంధం మీదే కామెంట్లా

సెలబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేస్తారని ఎదురు చూస్తున్న బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో ఎదురు చూస్తూనే ఉంటుంది. దొరకడం ఆలస్యం ఇదుగో పులి అదిగో తోక తరహా రకరకాల కథనాలు వండి వార్చేస్తుంది. ఇప్పుడు రాజమౌళి దొరికారు. నిన్న మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో పెద్ద హంగామా జరిగింది. అభిమానులు రకరకాల రూపాల్లో తమ ప్రేమను ప్రదర్శించారు. విదేశాల్లో ఆది స్పెషల్ షోలు వేసుకుని మురిసిపోయారు. ఇక్కడ నంద్యాల కడపలోనూ ప్రత్యేకంగా ప్రీమియర్లు పడ్డాయి.

ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎందరో ప్రత్యేకంగా విష్ చేశారు. రామ్ చరణ్ కూడా తమ బాండింగ్ ఎంత గొప్పదో ఒక ఫోటో, కొన్ని మాటల రూపంలో గొప్పగా వర్ణించాడు. అయితే జక్కన్న ట్వీట్ మాత్రం కనిపించలేదు. అంతే ఇద్దరికీ ఏదో చెడిందని, తారక్ కన్నా చరణ్ ఎక్కువగా ఆర్ఆర్ఆర్ లో హై లైట్ అయ్యాడని, దీంతో అభిమానుల ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకుని జూనియర్ అప్పటి నుంచి కొంత దూరం మైంటైన్ చేస్తున్నాడని ఇలా ఏవేవో ప్రచారాలు మొదలైపోయాయి. కానీ ఇక్కడ వాళ్ళు మిస్ అవుతున్నవి కొన్ని ఉన్నాయి.

రాజమౌళికి ఏ హీరోకు లేనంత బాండింగ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఉంది. అందులోనూ తన మొదటి సినిమా హీరోగా ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. ఈ కారణంగానే ఈ కాంబినేషన్ లో నాలుగు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ప్యాన్ ఇండియా మార్కెట్ ఇచ్చిన ప్రభాస్ తో చేసింది మూడే. పైగా ట్రిపులార్ ప్రమోషన్స్ లో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నారో అందరూ చూశారు. జక్కన్న ట్విట్టర్ లో చివరిసారి యాక్టివ్ గా ఉన్నది ఆరు రోజుల క్రితం. అది కూడా థామస్ కప్ గెలిచిన బ్యాడ్ మింటన్ టీమ్ ని విష్ చేయడానికి. నిన్న ఆర్ఆర్ఆర్ ఓటిటి గ్రాండ్ ప్రీమియర్ కు సైతం ఎలాంటి ట్వీట్ వేయలేదు. ఏదో కారణం వల్ల అందుబాటులో లేరనే చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా?

This post was last modified on May 22, 2022 7:33 am

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

2 hours ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

3 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

4 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

4 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

4 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

5 hours ago