గత వారం విడుదలై సెకండ్ వీక్ లో అడుగు పెట్టిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో కలెక్షన్లు కాదు కానీ ప్రధాన కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీలతో రెవిన్యూ వస్తోంది. యూనిట్ అధికారికంగా చెబుతున్న దాన్ని బట్టి మొన్నే 160 కోట్ల గ్రాస్ ని టచ్ చేసిన సర్కారు రెండు వందల కోట్లను చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. సరే ఈ లెక్కలు గట్రా పక్కన పెడితే కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా మహేష్ బాబు మూవీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని సోసో టాక్ తెచ్చుకున్నాయి.
రాజశేఖర్ హీరోగా రూపొందిన మలయాళం జోసెఫ్ రీమేక్ శేఖర్ కు ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. చాలా చోట్ల డెఫిసిట్లు పడ్డాయని ట్రేడ్ రిపోర్ట్. సినిమా కూడా ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి వీకెండ్లో ఎంత రాబట్టుకుంటే అంత సేఫ్ అవుతుంది. ఇక బండ్ల గణేష్ డేగల బాబ్జీని ఎవరూ పట్టించుకోలేదు. ధ్వని అనే మరో చిన్న చిత్రం వచ్చిన సంగతే ఎవరికీ తెలియదు. బాలీవుడ్ మూవీ భూల్ భులయ్య 2కి తెలుగు రాష్ట్రాల్లో ఏమంత రెస్పాన్స్ రాలేదు. నార్త్ లో బాగా వెళ్తోందని ట్రేడ్ రిపోర్ట్.
ఇక కంగనా రౌనత్ దాకడ్ ని క్రిటిక్స్ ఫ్లాప్ అని తేల్చేశారు.హైదరాబాద్ లోనూ జనం లేక షోలు రద్దయ్యాయి. సో సర్కారు వారి పాటనే ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అనూహ్యంగా శివ కార్తికేయన్ డాన్ పుంజుకోవడం విశేషం. ముఖ్యంగా యూత్ నుంచి మంచి అక్యుపెన్సీ వస్తోంది. రేపో ఎల్లుండో బ్రేక్ ఈవెన్ చేరుకోవడం లాంఛనమే. శని ఆదివారాలు ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సర్కారు వారి పాట, డాన్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 ఓటిటిలో వచ్చేశాయి కాబట్టి ఫైనల్ రన్ అయినట్టే.
This post was last modified on May 21, 2022 6:42 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…