ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది

స్టార్ హీరోల అభిమానులకు చాలా కోరికలుంటాయి. ఫలానా దర్శకుడితో తమ హీరో సినిమా చేయాలని, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ తమ హీరోకి మ్యూజిక్ ఇవ్వాలని ఇలానే చాలానే ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా ఇలాంటి ఓ కోరిక ఎప్పటి నుండో ఉంది. ఎన్టీఆర్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించాలనేది ఆ కోరిక. తన మ్యూజిక్ తో కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న అనిరుద్ తారక్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే థియేటర్స్ లో పూనకాలు తెచ్చుకుంటూ చూడాలనేది ఫ్యాన్స్ కోరిక.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’కి ముందుగా అనిరుద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ తర్వాత అనిరుద్ బదులు తమన్ ని తీసుకున్నారు. అప్పటి నుండి ఫ్యాన్స్ ఎన్టీఆర్ తో అనిరుద్ వర్క్ చేసే మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివతో NTR30 ఎనౌన్స్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఉండాల్సిందే అంటూ గట్టిగా డిమాండ్ చేశారు. నిజానికి తారక్ కి కూడా ఎప్పటి నుండో అనిరుద్ తో ఓ సినిమా చేయాలనుంది. అనిరుద్ కూడా తన సినిమా రిలీజ్ కి ఎన్టీఆర్ కాల్ చేసి మాట్లాడతారని ఓ సందర్భంలో చెప్పుకున్నాడు.

ఇప్పుడు ఎట్టకేలకు ఫ్యాన్స్ ఎదురుచూసిన కాంబో కొరటాల శివ సినిమాతో కుదిరింది. తాజాగా రిలీజైన మోషన్ పోస్టర్ లో అనిరుద్ మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి. మోషన్ పోస్టర్ కే ఈ లెవెల్ బీజీఏం ఇస్తే ఇక సినిమాకి ఎలాంటి స్కోర్ ఇస్తాడో అంటూ తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఈ కాంబో ఈ పాన్ ఇండియా మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ? ఎన్టీఆర్ సినిమాకి అనిరుద్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తాడో ? చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బేనర్ లో మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే బయటికి రానున్నాయి.